Telugu Global
Cinema & Entertainment

బన్నీని మెచ్చుకున్న సల్మాన్

అల్లు అర్జున్ నటించిన ఓ పాటను ఇప్పటికే ఓసారి వాడేశాడు సల్మాన్. ఆ సాంగ్ బాలీవుడ్ లో కూడా పెద్ద హిట్టయింది. ఇప్పుడు బన్నీ నటించిన మరో సాంగ్ ను కూడా వాడేశాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాధమ్ సినిమాలోని సీటీమార్ పాటను తన కొత్త సినిమా రాధేలో వాడేశాడు. ఈ మేరకు ఆ సాంగ్ కూడా ఈరోజు రిలీజైంది. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ వేశాడు. ఆ […]

బన్నీని మెచ్చుకున్న సల్మాన్
X

అల్లు అర్జున్ నటించిన ఓ పాటను ఇప్పటికే ఓసారి వాడేశాడు సల్మాన్. ఆ సాంగ్ బాలీవుడ్ లో కూడా పెద్ద
హిట్టయింది. ఇప్పుడు బన్నీ నటించిన మరో సాంగ్ ను కూడా వాడేశాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన
దువ్వాడ జగన్నాధమ్ సినిమాలోని సీటీమార్ పాటను తన కొత్త సినిమా రాధేలో వాడేశాడు. ఈ మేరకు ఆ
సాంగ్ కూడా ఈరోజు రిలీజైంది.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, బన్నీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ వేశాడు. ఆ పాటను తనకిచ్చినందుకు
థ్యాంక్స్ చెబుతూనే.. సాంగ్ లో బన్నీ స్టెప్స్ బాగా వేశాడని, బాగా పెర్ఫార్మ్ చేశాడని మెచ్చుకున్నాడు. ఆ
వెంటనే బన్నీ కూడా రియాక్ట్ అయ్యాడు. సల్మాన్ కు థ్యాంక్స్ చెప్పాడు.

కట్ చేస్తే, ఇప్పుడు బన్నీ చేసిన సీటీమార్ సాంగ్ కు, సల్మాన్ చేసిన హిందీ సీటీమార్ సాంగ్ కు పోలికలు
తీయడం మొదలుపెట్టారు నెజిటన్లు. అసలే సల్మాన్ ఖాన్ స్టెప్పులు అంతంతమాత్రంగా వేస్తాడు. బన్నీ ఓ
రేంజ్ లో ఇరగదీస్తాడు. పైగా ఇద్దరి వయసుల్ని దృష్టిలో పెట్టుకుంటే, స్టెప్పుల్ని కంపేర్ చేయడం తప్పే
అయినప్పటికీ.. సాంగ్ ఒకటే కావడంతో సాధారణంగా పోలిక మొదలైంది. సల్మాన్ సరిగ్గా స్టెప్పులు
వేయలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు నెజిజన్లు.

అటు నార్త్ లో మాత్రం సల్మాన్ అభిమానులు.. సీటీమార్ సాంగ్ తో పండగ చేసుకుంటున్నారు. నార్త్ లో
చాలామందికి ఈ పాట కొత్త. సల్మాన్ ట్వీట్ చేసేంతవరకు ఇది రీమేక్స్ అనే సంగతి అక్కడ చాలామందికి
తెలియదు.

First Published:  26 April 2021 10:02 AM GMT
Next Story