Telugu Global
Cinema & Entertainment

అప్పుడు నో.. ఇప్పుడు ఎస్

దృశ్యం-2 తెలుగు రీమేక్ ను శరవేగంగా పూర్తిచేశారు. కేవలం 2 షెడ్యూల్స్ లో ఎలాంటి సెట్స్ అవసరం లేకుండా సినిమా పూర్తయింది. అదే ఊపులో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని కూడా అనుకున్నారు. కానీ అంతలోనే సెకెండ్ వేవ్ మొదలైంది. థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఒరిజినల్ సినిమాలానే దృశ్యం-2 తెలుగు రీమేక్ కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారంతా. గతంలో ఇలా వచ్చిన పుకార్లను సురేష్ బాబు ఖండించారు. తమ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని, తర్వాతే […]

అప్పుడు నో.. ఇప్పుడు ఎస్
X

దృశ్యం-2 తెలుగు రీమేక్ ను శరవేగంగా పూర్తిచేశారు. కేవలం 2 షెడ్యూల్స్ లో ఎలాంటి సెట్స్ అవసరం
లేకుండా సినిమా పూర్తయింది. అదే ఊపులో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని కూడా
అనుకున్నారు. కానీ అంతలోనే సెకెండ్ వేవ్ మొదలైంది. థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో ఒరిజినల్
సినిమాలానే దృశ్యం-2 తెలుగు రీమేక్ కూడా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారంతా.

గతంలో ఇలా వచ్చిన పుకార్లను సురేష్ బాబు ఖండించారు. తమ సినిమా థియేటర్లలోనే రిలీజ్
అవుతుందని, తర్వాతే ఓటీటీలోకి వస్తుందని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే, ఆ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే
మాటమారింది. వ్యూహం మారింది. దృశ్యం-2 సినిమా ఓటీటీలోకి నేరుగా రాబోతోంది.

అవును.. దృశ్యం-2 తెలుగు రీమేక్ కు మంచి ఆఫర్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సంస్థ ఈ
సినిమాకు మంచి ఎమౌంట్ కోట్ చేసింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా
లేవు. దీంతో సురేష్ బాబు నిర్ణయం తీసేసుకున్నారు. రేపోమాపో దీనిపై అధికారిక ప్రకటన వస్తుంది.

First Published:  26 April 2021 10:05 AM GMT
Next Story