Telugu Global
International

ఇండియాను చూస్తే గుండె తరుక్కుపోతోంది..! అమెరికా

భారత్​ పరిస్థితి చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్​ అన్నారు. భారత్​కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకు 3లక్షల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్​ పరిస్థితిపై వివిధ దేశాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. వైట్​హౌస్​లో ప్రస్తుతం […]

ఇండియాను చూస్తే గుండె తరుక్కుపోతోంది..! అమెరికా
X

భారత్​ పరిస్థితి చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి అంటోని బ్లింకెన్​ అన్నారు. భారత్​కు అన్ని విధాలా సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనదేశంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకు 3లక్షల పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్​ పరిస్థితిపై వివిధ దేశాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి. వైట్​హౌస్​లో ప్రస్తుతం అనేకమంది భారతీయులు పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరంతా భారత్​కు సాయం చేయాలని జో బైడెన్​ను కోరారు. దీంతో జో బైడెన్​ కూడా సానుకూలంగా స్పందించారు. భారత దేశానికి కావాల్సిన వైద్య పరికరాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే ఆర్థిక సాయం కూడా చేస్తామని బైడెన్​ ప్రకటించారు. భారత్​ పరిస్థితిపై వైట్​హౌస్​లోని అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. భారత్​కు ఏ విధమైన సాయం చేయాలి అనే విషయంపై వాళ్లు చర్చించారు.

భారత్ లో పరిస్థితిపై 24 గంటలూ సమీక్షిస్తున్నామని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ చెప్పారు. వివిధ దేశాలు సైతం భారత్​ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ కూడా భారత్​పై జాలి చూపించారు. భారత్​ .. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అవసరమైతే ఆ దేశానికి సాయం చేస్తామని ప్రకటించారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే రోజుకు మూడున్నర లక్షల దాకా కేసులు నమోదవుతున్నాయి. ఇక అనధికారికంగా చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. మరణాల సంఖ్యపై రాష్ట్రాలు చెప్పే లెక్కలు కూడా నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే ప్రతిరోజు శ్మశానాల దగ్గర వందల కొద్ది కరోనా మృతదేహాలు దహనమవుతున్నాయి. కొన్ని చోట్ల శవాలతో కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం మాత్రం తక్కువ మరణాలను చూపుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్​ కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు సంపూర్ణ లాక్​డౌన్​ విధిస్తున్నట్టు ప్రకటించాయి. తాజాగా కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కూడా పూర్తిస్థాయి లాక్​ డౌన్​ను అమలు చేయబోతున్నట్టు ప్రకటించాయి. తమిళనాడులో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేయబోతున్నది. ఈ నెల 25 నుంచి లాక్​డౌన్​ విధిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  25 April 2021 3:09 AM GMT
Next Story