Telugu Global
National

మే 2 తర్వాత దేశవ్యాప్త లాక్​డౌన్​?

దేశంలో మరోసారి లాక్​డౌన్​ విధించబోతున్నారా? కరోనా కట్టడికి అంతకు మించి మరో మార్గం లేదని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. దేశంలో మరోసారి లాక్​డౌన్​ విధించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మే 2 నుంచి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలు చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో కొంతమంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో కేంద్రం లాక్​డౌన్​ విధించినప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవించింది వలసకూలీలే. […]

మే 2 తర్వాత దేశవ్యాప్త లాక్​డౌన్​?
X

దేశంలో మరోసారి లాక్​డౌన్​ విధించబోతున్నారా? కరోనా కట్టడికి అంతకు మించి మరో మార్గం లేదని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. దేశంలో మరోసారి లాక్​డౌన్​ విధించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మే 2 నుంచి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలు చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో కొంతమంది ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వలస కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గతంలో కేంద్రం లాక్​డౌన్​ విధించినప్పుడు ఎక్కువగా కష్టాలు అనుభవించింది వలసకూలీలే. దేశంలో ఉన్నట్టుండి లాక్​డౌన్​ విధించడంతో వలసకూలీలు కాలినడకన సొంత ఊర్లకు పయనమయ్యారు. కొంతమంది వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. అందులో గర్భిణులు, బాలింతలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం లాక్​డౌన్​ విధిస్తారని వార్తలు రావడంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు వలస కార్మికులు సొంత ఊర్లకు బయలుదేరి వెళ్లారు. గత మార్చిలో లాక్​ డౌన్​ విధించడంతో వలసకూలీలంతా స్వగ్రామాలకు చేరుకున్నారు. అయితే కేసుల తీవ్రత తగ్గడంతో మళ్లీ నగరాలకు చేరుకున్నారు. వారంతా ప్రస్తుతం మళ్లీ పల్లెబాట పడుతున్నారు.

మరోవైపు దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో లాక్​డౌన్​ విధించడం మినహా వేరే మార్గం లేదని చెబుతున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం మనదేశంలో రకరకాల వేరియంట్​ వైరస్​లు వ్యాపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్​, కర్ణాటక రాష్ట్రాల్లో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు కూడా దొరకడం లేదు. ఆక్సిజన్​ కొరతతో రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్​ బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో లాక్​డౌన్​ విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం.

అయితే గతంలో మనదేశంలో లాక్​డౌన్​ విధించడంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పటికీ కోలుకోలేదు. మరోసారి లాక్​ డౌన్​ విధిస్తే పరిస్థితి ఏమిటని కేంద్రం చర్చలు జరుపుతున్నది. ఇదిలా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం కాబట్టి.. ఆ దిశలో ఆలోచించి లాక్​డౌన్​ విధించడానికే కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మే 2 నుంచి దేశవ్యాప్త లాక్​ డౌన్​ విధించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

First Published:  25 April 2021 3:52 AM GMT
Next Story