Telugu Global
International

జపాన్ తీరే వేరు.. కరోనాపై వాళ్ల ప్లాన్ ఏంటంటే..

ప్రపంచమంతా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు జరుగుతుంటే.. జపాన్ మాత్రం ఇప్పటికీ వ్యాక్సినేషన్ మొదలుపెట్టలేదు. దానికి బదులు వారు ఇప్పటికీ సోషల్ డిస్టెన్సింగ్ తో.. తెలివిగా, ప్రపంచం కంటే డిఫరెంట్ గా వైరస్ ను ఎదుర్కొంటున్నారు. జపాన్ వాళ్లు ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే.. జపాన్ ప్రపంచం కంటే కొత్త మోడల్ ను అనుసరిస్తోంది. కొత్త కరోనావైరస్ తో కలిసి జీవించాలని జపాన్ నిర్ణయించింది. ఈ మోడల్‌ను ఎక్కువ కాలం అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని, వైరస్‌తో కలిసి జీవించడం, […]

జపాన్ తీరే వేరు.. కరోనాపై వాళ్ల ప్లాన్ ఏంటంటే..
X

ప్రపంచమంతా వ్యాక్సినేషన్ డ్రైవ్ లు జరుగుతుంటే.. జపాన్ మాత్రం ఇప్పటికీ వ్యాక్సినేషన్ మొదలుపెట్టలేదు. దానికి బదులు వారు ఇప్పటికీ సోషల్ డిస్టెన్సింగ్ తో.. తెలివిగా, ప్రపంచం కంటే డిఫరెంట్ గా వైరస్ ను ఎదుర్కొంటున్నారు. జపాన్ వాళ్లు ఫాలో అయ్యే టిప్స్ ఏంటంటే..

జపాన్ ప్రపంచం కంటే కొత్త మోడల్ ను అనుసరిస్తోంది. కొత్త కరోనావైరస్ తో కలిసి జీవించాలని జపాన్ నిర్ణయించింది. ఈ మోడల్‌ను ఎక్కువ కాలం అనుసరించడానికి సిద్ధంగా ఉండాలని, వైరస్‌తో కలిసి జీవించడం, పనిచేయడం నేర్చుకోవాలని “కొత్త జీవిత నమూనా” ని ప్రకటించింది. అదేంటంటే..

⦁ ప్రతి చోట సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.
⦁ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.
⦁ చేతులు తరచుగా కడగుతుండాలి.
⦁ ప్రభుత్వం ప్రతి పబ్లిక్ ప్లేస్ లో రెండు మీటర్ల దూరం పాటించేలా చూస్తారు.
⦁ ఇతర వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడకుండా చూసుకోవాలి.
⦁ ఇంటికి వెళ్లిన వెంటనే ముఖం, బట్టలు కడగాలి
⦁ ఒకరి చేతిని తాకిన వెంటనే కడుక్కోవాలి.
⦁ ఆన్‌లైన్ షాపింగ్, ఆన్ లైన్ పేమెంట్స్ ను మాత్రమే వాడాలి.
⦁ సూపర్ మార్కెట్ షాపింగ్ కు సింగిల్ గా మాత్రమే వెళ్లాలి.
⦁ మార్కెట్ కు వెళ్తే.. రద్దీ లేని టైం ను ఎంచుకోవాలి.
⦁ ఎక్కడకి వెళ్లినా ఎలాంటి వస్తువులను తాకకుండా ఉండాలి.
⦁ ఎక్కడికి వెళ్లినా వీలైనంత వరకూ బైక్ లేదా కాలినడకన వెళ్ళేలా చూసుకోవాలి.
⦁ ఆఫీస్, బిజినెస్ మీటింగ్స్ అన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగాలి.
⦁ ప్రతి ఆఫీస్, ప్రతీ ఇంట్లో.. వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి.
⦁ ఇంట్లో పని చేయండి లేదా గరిష్ట సమయంలో ప్రయాణించండి
⦁ వైరస్ స్థానికంగా ఉన్న దేశాలకు లేదా ప్రదేశాలకు వెళ్లకూడదు.
⦁ లక్షణాలు ఉన్నవారు.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లారో, ఎవరిని కలుసుకున్నారో గుర్తుంచుకోవాలి.
⦁ ఆహారాన్ని కూడా అందరూ కలిసి కాకుండా వ్యక్తిగతంగా సెపరేట్ గా తినాలి. వీలైతే సెపరేట్ గా వండుకోవాలి.
⦁ భోజనంలో ప్రాసెస్డ్ ఫుడ్ కంటే.. కూరగాయలు, పండ్లను ఎక్కువగా ప్రిఫర్ చేయాలి.
⦁ ప్రతి రోజూ పొద్దునే బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఎవరికి వారు వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి.
⦁ ఇరుకైన ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకూడదు.

జపాన్ ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ పూర్తిగా అభివృద్ధి చెందడానికి, అధికారికంగా ఉపయోగంలోకి రావడానికి కనీసం ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకూ వైరస్‌తో కలిసి జీవించడం నేర్చుకోవాలి. కొత్త జీవిత నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మనం కరోనా వైరస్‌తో ఎక్కువ కాలం శాంతియుతంగా జీవించగలం అని ప్రకటించారు. అందుకే ఇప్పటికీ ఇలాంటి మోడల్ ను పాటిస్తున్నారు.

కరోనా అనేది దీర్ఘకాలిక యుద్ధం అని అందరూ అర్థం చేసుకున్నారు, కాని ఆ యుద్దాన్ని పక్కాగా కొనసాగించడంలో జపాన్ ఒక్కటే చాలావరకూ సక్సెస్‌ అవ్వగలుగుతుంది. జపాన్ చాలా క్రమశిక్షణ కలిగిన దేశం. అలాగే వారు ఎక్కువగా పని చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో సూచనలను కఠినంగా పాటిస్తారు. ప్రభుత్వం కూడా కఠినంగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలసీలను అమలు చేస్తుంది. అందుకే వాళ్లు వైరస్ తో కలిసి జీవించడంలో సక్సెస్‌ అవ్వగలుగుతున్నారు. ఇదీ జపాన్ కథ.

First Published:  24 April 2021 4:58 AM GMT
Next Story