Telugu Global
Health & Life Style

టీకాపై డౌట్స్ ఉన్నాయా.. ఇదిగో క్లారిఫికేషన్..

మన దేశంలో యాంటీ కోవిడ్ టీకా మొదలుపెట్టి కొన్ని నెలలు అయినా.. ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై సరైన అవగాహన లేదు. అలాగే వ్యాక్సిన్ విషయాల్లో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అలాంటి అన్ని రకాల డౌట్స్ ను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.. 1) అర్హత ఉంటే నేను టీకా తీసుకోవాలా? – అవును, వీలైనంత త్వరగా తీసుకోండి. 2) ఏ టీకా తీసుకోవాలి? – గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అలాగే రోగనిరోధక శక్తి కలిగి […]

టీకాపై డౌట్స్ ఉన్నాయా.. ఇదిగో క్లారిఫికేషన్..
X

మన దేశంలో యాంటీ కోవిడ్ టీకా మొదలుపెట్టి కొన్ని నెలలు అయినా.. ఇప్పటికీ చాలామందికి వ్యాక్సిన్ పై సరైన అవగాహన లేదు. అలాగే వ్యాక్సిన్ విషయాల్లో చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. అలాంటి అన్ని రకాల డౌట్స్ ను ఇప్పుడు క్లియర్ చేసుకుందాం..

1) అర్హత ఉంటే నేను టీకా తీసుకోవాలా?
– అవును, వీలైనంత త్వరగా తీసుకోండి.

2) ఏ టీకా తీసుకోవాలి?
– గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు అలాగే రోగనిరోధక శక్తి కలిగి ఉన్నవారు- కోవిషీల్డ్ తీసుకోండి. మిగతా వారు ఏ వ్యాక్సిన్ తీసుకున్నా పర్లేదు. కానీ రెండు డోసులు ఒకే టీకావై ఉండాలి.

3) నాకు ఇటీవల కోవిడ్ ఉంది? నేను టీకా తీసుకోవాలా? తీసుకోవాలనుకుంటే ఎప్పుడు తీసుకోవాలి?
– మీకు ఇంతకు ముందు కోవిడ్ – ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోయినా టీకా తీసుకోండి. కానీ మీరు పాజిటివ్ వచ్చిన రోజు నుంచి 90 రోజుల తర్వాత టీకా తీసుకోవడం మంచిది.

4) నేను వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను, తరువాత నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు రెండవ డోసు గురించి ఏమి చేయాలి?
– కోవిడ్ ఇన్ఫెక్షన్ కు మొదటి మోతాదు బూస్టర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి పాజిటివ్ వచ్చిన తర్వాత 60 నుంచి – 90 రోజుల తర్వాత రెండవ డోసు తీసుకోండి.

5) ఫైజర్ 95% సామర్థ్యాన్ని కలిగి ఉండగా, కోవిషీల్డ్ 62 నుంచి 90 శాతం మధ్య మాత్రమే సమర్థతను కలిగి ఉంది? మనకు నాసిరకం వ్యాక్సిన్ ఇస్తున్నారా?
– కోవిషీల్డ్, కోవాక్సిన్ ట్రయల్స్ కంటే ఫైజర్, మోడెర్నా ట్రయల్స్ చాలా ముందే పూర్తయ్యాయి. ఆ సమయంలో వేరియంట్లు చెలామణిలో లేవు. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు.

6)వ్యాక్సిన్ తర్వాత రక్తం గడ్డకట్టడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ భయపెడుతున్నాయి. అది నిజమేనా?
– వ్యాక్సిన్ తర్వాత రక్తం గడ్డ కట్టడం అనేది చాలా అరుదైన సందర్భం. కాబట్టి ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. పొగత్రాగే వారికి ఈ ప్రమాదం ఎక్కువ ఉంది.

7) వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు టీకా ఉపయోగం ఏంటి?
– కోవిడ్ టీకా అనేది వ్యాధి వల్ల మనకు కలిగే ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆస్పత్రి పాలవ్వకుండా.. శరీరం వైరస్ ను ఎదుర్కొనేలా ప్రోత్సహిస్తుంది. అంతేకానీ వైరస్ సంక్రమించకుండా అది ఆపలేదు. అయితే రెండు డోసులు పూర్తయిన 2, 3 వారాల తర్వాత పూర్తి ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం ఉత్తమం. అలాగే వ్యాక్సిన్ తర్వాత కూడాఅన్ని జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలి.

8) వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి?
– కోవిషీల్డ్ అయితే రెండు డోసులకు మధ్య 6 నుంచి- 8 వారాల గ్యాప్ ఉండాలని ప్రభుత్వం చెప్తోంది. కోవాక్సిన్ అయితే నాలుగు వారాలు ఉండాలి.

9) వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత అదనపు రక్షణ కోసం మరొకసారి టీకా తీసుకోవచ్చా..?
– దయచేసి అలాంటి పని చేయవద్దు. అది అత్యంత హానికరం కావచ్చు.

10) చాలా ఫిట్‌గా ఉండేవాళ్లు, రోజూ వ్యాయామం చేసేవాళ్లు.. ఎలాంటి అనారోగ్యం లేని వాళ్లు.. వ్యాక్సిన్ తీసుకోకుండా.. సొంత సామర్థ్యంపై ఆధారపడి.. ధైర్యంగా ఉండొచ్చా?
– మిమ్మల్ని మీరు బాగా చూసుకోవడం ద్వారా కోవిడ్ వ్యాధి నుంచి కోలుకోవచ్చని మీరు అనుకోవచ్చు. అది మంచిది కూడా.. కానీ 20 నుంచి 30 ఏళ్ల వయసున్న వాళ్లకు, పూర్తి ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్నవాళ్లకు కూడా కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రత పెరిగి, మరణించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అందుకే ఎలాంటి రిస్క్ చేయకుండా మీ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకోండి.

టీకా పూర్తి సామర్థ్యంతో పని చేస్తుంది. అలాగే ఎలాంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. కాబట్టి ధైర్యంగా టీకా తీసుకోండి. సరైన ఆహారం తింటూ.. జాగ్రత్తలు పాటిస్తూ.. సేఫ్ గా ఆరోగ్యంగా ఉండండి.

First Published:  24 April 2021 4:17 AM GMT
Next Story