Telugu Global
Health & Life Style

శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే..

దేశంలో ఆక్సిజన్ కొరత నడుస్తోంది. మరో పక్క కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరిగిపోతన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు సేఫ్ గా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు. అందుకే ఎలాంటి అపాయం రాకముందే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంపొందించుకునేలా ప్లాన్ చేసుకోవాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి కరోనా సోకితే.. వారికి కృత్రిమ ఆక్సిజన్ అవసరమవుతుంది. అందుకే ఇప్పటినుంచే శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లతో.. యాంటీఆక్సిడెంట్లు.. […]

శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే..
X

దేశంలో ఆక్సిజన్ కొరత నడుస్తోంది. మరో పక్క కరోనా కేసులు, మరణాలు రోజురోజుకీ పెరిగిపోతన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి వారు సేఫ్ గా జాగ్రత్తలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు. అందుకే ఎలాంటి అపాయం రాకముందే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంపొందించుకునేలా ప్లాన్ చేసుకోవాలి.
శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారికి కరోనా సోకితే.. వారికి కృత్రిమ ఆక్సిజన్ అవసరమవుతుంది. అందుకే ఇప్పటినుంచే శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి.

యాంటీఆక్సిడెంట్లతో..
యాంటీఆక్సిడెంట్లు.. జీర్ణక్రియ ద్వారా శరీరం ఆక్సిజన్ ను గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతాయి. యాంటీఆక్సిడెంట్స్ కోసం బ్లూబెర్రీస్, క్రాన్ బెర్రీస్, కిడ్నీ బీన్స్, బ్లాక్ బెర్రీస్ లాంటివి తినాలి. అలాగే శరీరంలో ఉండే కొవ్వు ఆమ్లాలు.. రక్తప్రవాహంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి పనిచేస్తాయి. అందుకే హెల్దీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే సోయాబీన్స్, వాల్నట్స్, అవిసె గింజలు లాంటివి తీసుకోవాలి.

వ్యాయామంతో..
శరీరం ఆక్సిజన్ తీసుకునే శాతాన్ని పెంచడం కోసం వ్యాయామం బాగా పనికొస్తుంది. వ్యాయామం ద్వారా శరీరం వ్యర్థాలను తొలగిస్తూ.. వాటి ప్లేస్ లో ఆక్సిజన్ ను భర్తీ చేస్తుంది. అందుకే రోజుకి కనీసం ఇరవై నుంచి ముప్పై నిముషాల వ్యాయామం కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు ప్రాణాయామం లాంటి శ్వాస వ్యాయామాల ద్వారా కూడా ఊపిరితిత్తులకు ఆక్సిజన్ శాతాన్ని పెంచవచ్చు.

స్వచ్ఛమైన గాలితో..
ఆక్సిజన్ మన శరీరానికి అందాలంటే.. ముందుగా అది మన పరిసరాల్లో సరిగ్గా ఉండగలగాలి. అందుకే ఇంటి చుట్టూ చెట్లు పెంచడం వల్ల పరిసరాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉండేలా చూసుకోవచ్చు. పొల్యూషన్ బాగా ఉండే నగరాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకడం కష్టమే. అందుకే కనీసం ఎయిర్ ప్యూరిఫయర్లు అయినా వాడాలి.

నీరు తాగుతూ..
మన శరీరంలో 60 శాతం వరకూ నీరే కాబట్టి.. రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్లు నీటిని తాగాలి. శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. సాలిడ్ ఫుడ్స్ కంటే.. ద్రవ రూపంలో ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దానివ‌ల్ల‌ శరీర ఉష్ణోగ్రతలు కంట్రోల్ లో ఉంటాయి. అలాగే శరీరానికి సరైన మోతాదులో ఆక్సిజన్ ను గ్రహించే శక్తి పెరుగుతుంది.

First Published:  23 April 2021 3:24 AM GMT
Next Story