Telugu Global
Health & Life Style

మాస్క్‌తో మిస్టేక్స్ చేయొద్దు

ఇప్పుడు రోజువారీ వస్తువుల్లో మాస్క్ కూడా ముఖ్యమైన వస్తువైపోయింది. పైగా ఇప్పుడు మనల్ని కాపాడాల్సిన ముఖ్యమైన ఆయుధం కూడా అదే.. అయితే.. ఈ ఆయుధాన్ని వాడడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తప్పుగా వాడడం ద్వారా కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది. మాస్క్‌ను సరిగ్గా వాడాలి. తప్పుగా తొడుక్కుంటే మాస్క్ వాడి ఉపయోగముండదు. అసలు మాస్క్‌ను ఎలా తొడుక్కోవాలంటే.. ⦁ నోరు ముక్కు పూర్తిగా కవర్ అవ్వాలి. కొంతమంది గాలి సరిగా ఆడట్లేదనో.. కంఫర్ట్ గా లేదనో.. మాస్క్ […]

మాస్క్‌తో మిస్టేక్స్ చేయొద్దు
X

ఇప్పుడు రోజువారీ వస్తువుల్లో మాస్క్ కూడా ముఖ్యమైన వస్తువైపోయింది. పైగా ఇప్పుడు మనల్ని కాపాడాల్సిన ముఖ్యమైన ఆయుధం కూడా అదే.. అయితే.. ఈ ఆయుధాన్ని వాడడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. తప్పుగా వాడడం ద్వారా కూడా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టవుతుంది. మాస్క్‌ను సరిగ్గా వాడాలి. తప్పుగా తొడుక్కుంటే మాస్క్ వాడి ఉపయోగముండదు. అసలు మాస్క్‌ను ఎలా తొడుక్కోవాలంటే..

⦁ నోరు ముక్కు పూర్తిగా కవర్ అవ్వాలి. కొంతమంది గాలి సరిగా ఆడట్లేదనో.. కంఫర్ట్ గా లేదనో.. మాస్క్ ను ముక్కు కిందకు దించేస్తుంటారు. అలా చేయడం వల్ల మాస్క్ వాడి ఉపయోగముండదు. మాస్క్ ముఖ్యంగా అడ్డుకునేది ముక్కు ద్వారా వెళ్లే క్రిములనే.. అందుకే అది ఎప్పుడు ముక్కుని కవర్ చేస్తూనే ఉండాలి.

⦁ చాలామంది ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాస్క్ కిందకు తీసి మెడకు పెట్టుకుంటుంటారు. అలా ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. మాస్క్ ముక్కు నోరుకు తప్ప శరీరంలో ఇతర అవయవాలకు టచ్ అవ్వకూడదు. మాస్క్‌ను రిమూవ్ చేయాల్సివస్తే మాస్క్ కు ఉండే దారాలను మాత్రమే పట్టుకుని జాగ్రత్తగా తీసి పక్కన పెట్టాలి. మళ్లీ అవసరమైనప్పుడు అదేవిధంగా ధరించాలి.

⦁ మాస్క్ పెట్టుకున్నప్పుడు అది ముక్కు చివరకు గట్టిగా పట్టుకుని ఉండాలి. ఏమాత్రం వదులుగా ఉండకూడదు. వదులుగా ఉంటే బయటి క్రిములు ఈజీగా ముక్కు లేదా నోటిలోంచి లోపలికి ప్రవేశించే వీలుంది.

⦁ మాస్క్ పెట్టుకున్నప్పుడు అది ముక్కు కొనకు మాత్రమే టచ్ అవ్వాలి. అలా కాకుండా నోటికి కూడా టచ్ అవ్వడం వల్ల మాట్లాడేటప్పుడు నోటి నుంచి వచ్చే క్రిములు మాస్క్ కు తగిలి అక్కడే ఉండిపోతాయి.
ఒకే మాస్క్‌ను ఎక్కువసార్లు వాడినప్పుడు సరిగ్గా శభ్రం చేసి వాడాలి. లేకపోతే అదే మాస్క్ మనకు ప్రమాదంగా మారుతుంది. ఎక్కువసార్లు మాస్క్‌ను వాడదలచుకుంటే ఫ్యాబ్రిక్ మాస్క్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే మాస్క్ ను పడేయాలనుకుంటే జాగ్రత్తగా ఒక సంచిలో పెట్టి దూరంగా ఎవరూ లేని చోట చెత్తలో పడేయాలి

First Published:  22 April 2021 4:15 AM GMT
Next Story