Telugu Global
NEWS

పైప్​లైన్​ ద్వారా గ్యాస్​..! తీరనున్న ‘సిలిండర్’​ కష్టాలు..!

ఇంట్లో గ్యాస్​ అయిపోయిందంటే టెన్షన్​. సిలిండర్​ బుక్​ చేసుకోవాలి? అది వచ్చే వరకు వెయిట్​ చేయాలి. కానీ అలా కాకుండా నేరుగా పైప్​లైన్​ ద్వారా ఇంటికే గ్యాస్​ వచ్చేస్తే ఎంతో బాగుంటుంది కదా..! మనం వాడుకున్న మేరకే బిల్​ వేస్తారు. అది కూడా ఇప్పటి సిలిండర్​ కంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పటికే విదేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంది. మనదేశంలోకి కూడా వచ్చేసింది. పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాలకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. […]

పైప్​లైన్​ ద్వారా గ్యాస్​..! తీరనున్న ‘సిలిండర్’​ కష్టాలు..!
X

ఇంట్లో గ్యాస్​ అయిపోయిందంటే టెన్షన్​. సిలిండర్​ బుక్​ చేసుకోవాలి? అది వచ్చే వరకు వెయిట్​ చేయాలి. కానీ అలా కాకుండా నేరుగా పైప్​లైన్​ ద్వారా ఇంటికే గ్యాస్​ వచ్చేస్తే ఎంతో బాగుంటుంది కదా..! మనం వాడుకున్న మేరకే బిల్​ వేస్తారు. అది కూడా ఇప్పటి సిలిండర్​ కంటే తక్కువ ఖర్చుతోనే అయిపోతే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పటికే విదేశాల్లో ఇటువంటి పద్ధతి అమల్లో ఉంది. మనదేశంలోకి కూడా వచ్చేసింది. పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాలకు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది.

ప్రముఖ ఇంజినీరింగ్​ సంస్థ ‘మేఘా’ ఈ కొత్త టెక్నాలజీని మనదేశానికి తీసుకొచ్చింది. దీనివల్ల వినియోగదారులకు సులభంగా, సురక్షితంగా, తక్కువ ధరకే గ్యాస్​ అందుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎంఈఐఎల్​ ( మేఘ ఇంజనీరింగ్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్) ఈ విధానాన్ని మనదేశంలోకి తీసుకొచ్చింది. నేరుగా పైపుల ద్వారా ఇక గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్​ను సరఫరా చేస్తున్నది. వాహన అవసరాలకు కూడా ఇంధనాన్ని అందిస్తున్నది.

ఎల్పీజీ సిలిండర్ ధరలతో పోలిస్తే 40 శాతం తక్కువ రేటుకు మేఘా (ఎంఈఐఎల్) గ్యాస్ ను అందిస్తున్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఎంఈఐఎల్ గ్యాస్​ను సరఫరా చేస్తున్నది. తాజాగా తెలంగాణాలో తన సేవలను విస్తరించబోతున్నది.

నల్లగొండ జిల్లాలో ఇటీవల ఈ సేవలను ప్రారంభించారు.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ ఇంటికి వాణిజ్య పరంగా వంటగ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశ్యం తో సీజీడీ (City Gas Distribution) ప్రాజెక్టును తీసుకొచ్చింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల్లో పనులను పూర్తి చేసి చౌకధరలకు గ్యాస్ సరఫరా చేస్తోంది. రూ.5000 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మొత్తం 11 లక్షల గృహాలకు గ్యాస్ సరఫరా కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుతో దాదాపు 5 వేల మంది ఉపాధి పొందబోతున్నారని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

నల్లగొండ జిల్లాలోని వెలిగొండ మండలం, సుంకిషాల గ్రామంలో సహజవాయువు సరఫరా లో కీలకమైన సిటీ గేట్ స్టేషన్ (CGS), మదర్ స్టేషన్ ను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్యాస్ సరఫరా సేవలను మేఘా సంస్థ అందించనున్నది.
‘ఇంటింటికి సులభంగా, సురక్షితంగా గ్యాస్​ చేరవేయాలన్న ఉద్దేశ్యంతో ‘మేఘా గ్యాస్’​ ప్రాజెక్టును చేపట్టాం. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్​లో ప్రారంభించాం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ మొదలు పెట్టాం’ అని మేఘా గ్యాస్ బిజినెస్ హెడ్ పలింపాటి వెంకటేశ్ పేర్కొన్నారు.

ప్రజల అవసరాల దృష్ట్యా గ్యాస్ సిటీ గేట్ స్టేషన్ ద్వారా పీఎన్జీ ( piped natural gas) గృహ, పారిశ్రామిక అవసరాలకు, అలాగే మదర్ స్టేషన్ ద్వారా సీఎన్జీ (compressed Natural Gas)ని వాహన అవసరాల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. నల్లగొండలో మరో పది గ్యాస్​ స్టేషన్​ లను ప్రారంభిస్తామని చెప్పారు. 40,000 కుటుంబాలకు, అలాగే పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేసే ఉద్దేశ్యం తో పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు.

నల్లగొండ జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పైప్ లైన్ నిర్మాణంతో పాటు 20 సీఎన్జీ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నామని వెంకటేశ్​ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని తూంకూరు – బెల్గాం జిల్లాలలో గ్యాస్ సరఫరాను ఇప్పటికే ప్రారంభించారు. కృష్ణా జిల్లాలోని నున్న సమీపంలో సిటి గ్యేట్ స్టేషన్ ద్వారా, అలాగే తూంకూరు – బెల్గాం జిల్లాల్లోనూ గ్యాస్ ప్రాజెక్ట్ ను ప్రారంభించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ – వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్ సరఫరా చేయటం ద్వారా ఏకో ఫ్రెండ్లీ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది.

మేఘా గ్యాస్ ‘ఇట్స్ స్మార్ట్ – ఇట్స్ గుడ్’ అనే ట్యాగ్ లైన్ తో తన సేవలను విస్తరిస్తోంది. మేఘా గ్యాస్ గృహాలు – వాణిజ్య సంస్థలు – పారిశ్రామిక సంస్థలతో పాటు రవాణా వాహనాలకు సహజ వాయువును సరసమైన ధరకు అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లోని ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మదర్ స్టేషన్ నుంచి గ్యాస్ ను వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు స్టీల్ – ఎండీపీఈ పైప్​లను 722 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు.

First Published:  22 April 2021 2:48 AM GMT
Next Story