Telugu Global
NEWS

టీడీపీకి ‘లోకేశ్​’ వైరస్​ పట్టుకుంది.. టీకా తారక్​ 9999

సంచలన దర్శకుడు ఆర్​జీవీ మరోసారి ట్విట్టర్​లో చెలరేగిపోయాడు. ఈ సారి ఏకంగా తెలుగు దేశం పార్టీపైనే గురిపెట్టాడు. టీడీపీకి లోకేశ్​ అనే వైరస్​ పట్టుకుందని ఆ వైరస్​ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఆ వైరస్​కు వ్యాక్సిన్​ ఏమిటో కూడా ఆర్​జీవీ చెప్పేశాడు. వ్యాక్సిన్​ పేరు తారక్​ 9999 అంట. ఈ వ్యాక్సిన్​ తీసుకుంటే టీడీపీకి వచ్చిన వైరస్​ పోతుందంట. రామ్​గోపాల్​ వర్మ పెట్టిన ఈ ట్వీట్​ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తరచూ వివాదాస్పద విషయాలపై కామెంట్లు […]

టీడీపీకి ‘లోకేశ్​’ వైరస్​ పట్టుకుంది.. టీకా తారక్​ 9999
X

సంచలన దర్శకుడు ఆర్​జీవీ మరోసారి ట్విట్టర్​లో చెలరేగిపోయాడు. ఈ సారి ఏకంగా తెలుగు దేశం పార్టీపైనే గురిపెట్టాడు. టీడీపీకి లోకేశ్​ అనే వైరస్​ పట్టుకుందని ఆ వైరస్​ పార్టీని సర్వనాశనం చేస్తున్నదని వ్యాఖ్యానించాడు. ఆ వైరస్​కు వ్యాక్సిన్​ ఏమిటో కూడా ఆర్​జీవీ చెప్పేశాడు. వ్యాక్సిన్​ పేరు తారక్​ 9999 అంట. ఈ వ్యాక్సిన్​ తీసుకుంటే టీడీపీకి వచ్చిన వైరస్​ పోతుందంట. రామ్​గోపాల్​ వర్మ పెట్టిన ఈ ట్వీట్​ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తరచూ వివాదాస్పద విషయాలపై కామెంట్లు పెట్టే ఆర్​జీవి ఈ సారి ఏకంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్​ చేయడం గమనార్హం.

‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ అంటూ ఓ సినిమాను తెరకెక్కించి సంచలనం సృష్టించాడు వర్మ. ఆ తర్వాత పవర్​ స్టార్​ అంటూ ఓ పొలిటికల్​ సెటైర్​ సినిమాను వదిలాడు. ఇటీవల రాజకీయాలను కూడా వదలడం లేదు. రక్త చరిత్ర నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు తెరకెక్కిస్తున్నాడు వర్మ. గతంలో వంగవీటి అనే ఓ సినిమాను కూడా తీశాడు. అయితే నిత్యం వివాదాస్సద కామెంట్లు చేయడం.. సంచలనం సృష్టించిన ఘటనల ఆధారంగా సినిమాలు తీయడం వర్మకు అలవాటే.

అయితే రాజకీయాలపై చాలా తక్కువ సందర్భాల్లోనే వర్మ ట్వీట్లు పెడుతుంటాడు. తాజాగా టీడీపీపై ట్వీట్లు పెట్టడం సంచలనంగా మారింది. ఈ ట్వీట్లపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ‘తెలుగుదేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన సూక్ష్మ జీవి పట్టుకుంది.. అది ప్రాణాంతక వ్యాధి. ఆ వైరస్ నివారణగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దాని పేరే తారక్9999’ అంటూ వర్మ పేర్కొన్నారు.

టీడీపీకి అసలైన వారసుడు జూనియర్​ ఎన్టీఆరే అంటూ వర్మ గతంలోనూ ఓ సారి ట్వీట్​ పెట్టాడు. తాజాగా నారా లోకేశ్​న టార్గెట్​ చేస్తూ ట్వీట్​ పెట్టడం గమనార్హం. ఈ ట్వీట్​ ఇప్పుడు వైరల్​గా మారింది. వర్మ ట్వీట్​కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు వర్మ చేసిన సూచన 100 శాతం కరెక్ట్​ అంటూ సమర్థిస్తున్నారు. టీడీపీ అభిమానులు మాత్రం .. ‘మా పార్టీ వ్యవహారం నీకు ఎందుకు’ అంటూ వర్మను ప్రశ్నిస్తున్నారు.

దీనిపై టీడీపీ ముఖ్యనేతలు ఇంకా స్పందించలేదు. లోకేశ్​పై గత కొంతకాలంగా సొంతపార్టీనుంచే విమర్శలు వస్తున్నాయి. కొందరు నాయకులు బహిరంగంగానే జూనియర్ ని పార్టీలోకి తేవాలని కోరారు.

First Published:  21 April 2021 2:18 AM GMT
Next Story