Telugu Global
NEWS

పది, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయండి

పదో తరగతి, ఇంటర్మీడియట్​ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​ చేశారు. ఈ పరీక్షలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే పరీక్షలు రద్దు చేయాలని కోరారు. అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడగా ప్రభుత్వం వాళ్లను ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచనీయమని పేర్కొన్నారు. ‘తాను పట్టిన కుందేలుకు మూడే […]

పది, ఇంటర్​ పరీక్షలు రద్దు చేయండి
X

పదో తరగతి, ఇంటర్మీడియట్​ పరీక్షలను వెంటనే రద్దు చేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్​ చేశారు. ఈ పరీక్షలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి చెందుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే పరీక్షలు రద్దు చేయాలని కోరారు.

అనేక మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడగా ప్రభుత్వం వాళ్లను ప‌ట్టించుకోక‌పోవ‌డం శోచనీయమని పేర్కొన్నారు. ‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్నట్టు ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పవన్‌ మండిపడ్డారు.

ఏపీలో 16 లక్షల మందికిపైగా పది, ఇంటర్‌ విద్యార్థులున్నారని చెప్పారు. వారు కరోనా బారినపడితే పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు కోల్పోతారని పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సమర్థించుకున్న తీరు హాస్యాస్పదమన్నారు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌సీ పదో తరగతి పరీక్షలను రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. పది, ఇంటర్మీడియట్​ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని పవన్ డిమాండ్​ చేశారు.

First Published:  20 April 2021 8:57 PM GMT
Next Story