Telugu Global
Health & Life Style

కోవిడ్ భయం ఇలా దూరం..

లక్షల కొద్దీ కేసులు, వేల సంఖ్యలో మరణాలు.. సెకండ్ వేవ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. అందుకే ప్రజలే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాల్సిన సమయమిది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అంటే భయపడాల్సిన పరిస్థితి ఉండదు. కరోనాతో ఫైట్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కరోనా వైరస్ మనపై ప్రభావం చూపకుండా చూసుకునేందుకు కొన్ని టిప్స్ మేలు చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. కరోనాను ఎదుర్కోవాలంటే ముందుగా […]

కోవిడ్ భయం ఇలా దూరం..
X

లక్షల కొద్దీ కేసులు, వేల సంఖ్యలో మరణాలు.. సెకండ్ వేవ్ ఇప్పుడు దేశాన్ని వణికిస్తుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా కేసులు తగ్గుముఖం పట్టట్లేదు. అందుకే ప్రజలే ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండాల్సిన సమయమిది. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అంటే భయపడాల్సిన పరిస్థితి ఉండదు. కరోనాతో ఫైట్ చేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

కరోనా వైరస్ మనపై ప్రభావం చూపకుండా చూసుకునేందుకు కొన్ని టిప్స్ మేలు చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. కరోనాను ఎదుర్కోవాలంటే ముందుగా ఉండాల్సింది ఇమ్యూనిటీ.. దాని కోసం సరైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ మూడు రెబ్బల వెల్లుల్లి, అల్లం, పసుపు, పెసరపప్పు, లెమన్, స్ప్రౌట్స్ లాంటివి తినాలి.

కనీసం రోజుకి ఇరవై నిముషాల పాటైనా.. వ్యాయామాన్ని చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే కంటికి సరిపడా నిద్ర పోవడం ఎంతో అవసరం. వ్యాధి నిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే కంటినిండా నిద్ర ఉండాలి. నిద్ర కారణంగా శరీరంలో అన్ని వ్యవస్థలు రిపేర్ అవుతాయి. అలాగే నిద్ర ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది

ఇకపోతే వీటన్నింటికంటే ముఖ్యంగా కరోనా సమయంలో.. శుభ్రత అనేది చాలా ముఖ్యం. బయటకు వెళ్లి ఇంటికి రాగానే చేతులను శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్‌ను వినియోగించడం లాంటివి చేయాలి.
అలాగే రోజూ స్నానం చేయడం, ఇంటిని శుభ్రం చేయడం కూడా మర్చిపోకూడదు. వీటితో పాటు రోజూ శ్వాస సంబంధిత వ్యాయామాలు, మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి కూడామంచి రిజల్ట్స్‌నిస్తాయి.

First Published:  20 April 2021 4:30 AM GMT
Next Story