Telugu Global
Health & Life Style

వ్యాక్సిన్‌కు ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి?

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే.. వ్యాక్సిన్ కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే.. క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న త‌ర్వాత‌ ప్రత్యేకంగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించుకోవచ్చు. కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి […]

వ్యాక్సిన్‌కు ముందు, త‌ర్వాత‌ ఎలాంటి ఆహారం తినాలి?
X

క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే.. వ్యాక్సిన్ కు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..

క‌రోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు, తీసుకున్న త‌ర్వాత‌ ప్రత్యేకంగా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అప్పుడే వ్యాక్సిన్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను తగ్గించుకోవచ్చు.

కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందు, త‌ర్వాత నీళ్లు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదంటున్నారు డాక్టర్లు. నీటిని ఎక్కువ‌గా తాగ‌డం, అలాగే నీటి శాతం ఎక్కువ‌గా ఉన్న పండ్లు తిన‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. దాంతో పాటు రోగ నిరోధ‌క వ్యవ‌స్థ ప‌నితీరు సక్రమంగా ఉంటుంది

వ్యాక్సిన్ కు ముందు, తర్వాత ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. వ్యాక్సిన్ వేయించుకోడానికి ఒక వారం ముందు నుంచే ఆల్కహాల్ మానేయాలి. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా రెండు మూడు వారాల వరకూ ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

వ్యాక్సిన్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను తట్టుకోవాలంటే శరీరానికి సరైన ఆహారం అందాలి. అందుకే వ్యాక్సిన్ కు ముందు, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి తీసుకోవడం వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్‌ను త‌ట్టుకునే శ‌క్తి క్షీణిస్తుంది. అందుకే ప్రాసెస్‌డ్ ఫుడ్ బ‌దులు అధిక ఫైబ‌ర్ ఉండే మిల్లెట్స్, గోధుమ‌ల‌ను తీసుకోవ‌డం మంచిది.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అల‌స‌ట‌, నీరసం వంటి ల‌క్షణాలు కనిపించడం కామన్. అందుకే ఇలాంటప్పుడు శరీరానికి శక్తినిచ్చే ఫ్రూట్స్, కూరగాయలు, ప్రొటీన్ ఫుడ్ తినాలి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేలా బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి.

First Published:  19 April 2021 3:29 AM GMT
Next Story