Telugu Global
NEWS

‘పొలవరం’ అంచనాలు పెంచారు.. కారణం ఇదే..!

పొలవరం ప్రాజెక్టు అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పొలవరం అంచనాలు ఉన్నట్టుండి ఎందుకు పెంచారు? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజానికి ఇటీవల డీడీఆర్​పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ తర్వాత కొత్త డిజైన్​లు ప్రతిపాదించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో భారీ మార్పు చోటుచేసుకున్నది. కొత్త డిజైన్​కు అనుగుణంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో అప్రోచ్ చానెల్ లో 32 లక్షల […]

‘పొలవరం’ అంచనాలు పెంచారు.. కారణం ఇదే..!
X

పొలవరం ప్రాజెక్టు అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పొలవరం అంచనాలు ఉన్నట్టుండి ఎందుకు పెంచారు? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. నిజానికి ఇటీవల డీడీఆర్​పీ సభ్యులు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ తర్వాత కొత్త డిజైన్​లు ప్రతిపాదించారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో భారీ మార్పు చోటుచేసుకున్నది. కొత్త డిజైన్​కు అనుగుణంగానే ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్టు అధికారులు చెబుతున్నారు.

గతంలో అప్రోచ్ చానెల్ లో 32 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే తవ్వాల్సి ఉండేది. అయితే డీడీఆర్​పీ సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఇది 1.16 కోట్ల క్యూబిక్​ మీటర్లు పెరిగింది. దీంతో అంచనాలను కూడా పెంచేశారు.

స్పిల్ ఛానెల్ ఎండ్ కట్ ఆప్ వాల్ నిర్మాణం కూడా చేపట్టనున్నారు. దీంతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానెల్ కి ఇరువైపులా ఉన్న కొండలకు రక్షణ చర్యలు చేపట్టబోతున్నారు.

మరోవైపు గ్యాప్-1, ఎర్త్ డ్యాం నిర్మాణం, గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం నిర్మాణం,
గ్యాప్-1 అప్రోచ్ ఏరియాలో ప్రొటెక్షన్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులను డీడీఆర్​పీ అదనంగా సూచించింది. దీంతో పోలవరం ప్రాజెక్టు పనులను పెంచబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

First Published:  19 April 2021 10:12 AM GMT
Next Story