Telugu Global
NEWS

ఏబీ వెంకటేశ్వర రావుపై క్రమశిక్షణా చర్యలు..!

ఆంధ్రప్రదేశ్​ మాజీ ఇంటెలిజెన్స్​ చీఫ్​ ఏబీ వెంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించింది. వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి బాబాయ్​ వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై ఏబీ వెంకటేశ్వర రావు .. సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది. గతంలో సిట్​ దర్యాప్తు చేసినప్పుడు ఎటువంటి వివరాలు ఇవ్వని ఏబీ వెంకటేశ్వరావు ప్రస్తుతం సీబీఐకి లేఖ రాయడం […]

ఏబీ వెంకటేశ్వర రావుపై క్రమశిక్షణా చర్యలు..!
X

ఆంధ్రప్రదేశ్​ మాజీ ఇంటెలిజెన్స్​ చీఫ్​ ఏబీ వెంకటేశ్వర రావుపై ఏపీ ప్రభుత్వం క్రమ శిక్షణా చర్యలకు ఉపక్రమించింది. వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డి బాబాయ్​ వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసుపై ఏబీ వెంకటేశ్వర రావు .. సీబీఐకి లేఖ రాయడం సంచలనంగా మారింది.

గతంలో సిట్​ దర్యాప్తు చేసినప్పుడు ఎటువంటి వివరాలు ఇవ్వని ఏబీ వెంకటేశ్వరావు ప్రస్తుతం సీబీఐకి లేఖ రాయడం అంటే క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించడమేనని ఏపీ పోలీసులు అంటున్నారు.
ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు .. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి సస్పెన్షన్​లో ఉన్నారు. ప్రస్తుతం మరోసారి ఆయనపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

ఈ విషయంపై డీఐజీ పాలరాజు మీడియాతో మాట్లాడుతూ.. ‘ వైఎస్​ వివేకానందరెడ్డి హత్యకేసు నాడు చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వర్​రావు కనుసన్నల్లో సాగింది. అప్పట్లో వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారంతోనే చంద్రబాబు మీడియాతో మాట్లాడేవారు. సీఎం జగన్​ అధికారంలోకి వచ్చాక ఈ కేసును సిట్​ విచారించింది. ఆ టైంలో సిట్​కు ఏబీ వెంకటేశ్వర్​రావు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ఇవ్వలేదు. ఇలా చేయడం సర్వీస్​ రూల్స్​ను ఉల్లంఘించడమే.

గతంలో ఆధారాలు లేకపోయినా జగన్​ మోహన్​రెడ్డి బంధువులను అరెస్ట్​ చేయాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు అప్పటి దర్యాప్తు అధికారి రాహుల్​ దేవ్​పై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ ఆధారాలు లేకపోవడంతో రాహుల్​ దేవ్​ అరెస్ట్​ చేయలేదు’ అని అన్నారు. కాగా ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐకి లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటి?’ అంటూ ఆయన ప్రశ్నించారు.

అయితే తాజాగా ఏబీ వెంకటేశ్వర్ రావుపై ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నది.
కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచారణ అనంతరం ఏబీవీ చేసిన కామెంట్లని సీరియస్సుగా తీసుకున్న జగన్ సర్కార్.. 30 రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అఖిల భారత సర్వీస్‌ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ఏబీ వెంకటేశ్వరరావు (ఐపీఎస్‌ బ్యాచ్‌ 1989)పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

First Published:  18 April 2021 11:34 PM GMT
Next Story