Telugu Global
NEWS

దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు .. రేపు హాజరు కావాల్సిందే..!

మాజీ మంత్రి, టీడీపీ కీలకనేత దేవినేని ఉమా మహేశ్వర్​రావుకు సీఐడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించారు. ఉమపై వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియోలు సంచలనంగా మారాయి. ఈ వీడియోలో సీఎం జగన్​ మోహన్ రెడ్డి, తిరుపతిపై మాట్లాడారు. అయితే జగన్​ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను మార్ఫింగ్​ చేసి వీడియో […]

దేవినేని ఉమకు మరోసారి సీఐడీ నోటీసులు .. రేపు హాజరు కావాల్సిందే..!
X

మాజీ మంత్రి, టీడీపీ కీలకనేత దేవినేని ఉమా మహేశ్వర్​రావుకు సీఐడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించారు. ఉమపై వివిధ సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఓ మీడియా సమావేశంలో దేవినేని ఉమ ప్రదర్శించిన వీడియోలు సంచలనంగా మారాయి.

ఈ వీడియోలో సీఎం జగన్​ మోహన్ రెడ్డి, తిరుపతిపై మాట్లాడారు. అయితే జగన్​ వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను మార్ఫింగ్​ చేసి వీడియో ప్రదర్శించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మరోవైపు ఈ వీడియోపై కొందరు వైసీసీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విచారిస్తున్నది.

విచారణలో భాగంగా సదరు వీడియోను తీసుకొని తమముందుకు హాజరు కావాలని ఈ నెల 15న సీఐడీ అధికారులు ఉమకు నోటీసులు పంపించారు. అయితే ప్రస్తుతం తాను కోవిడ్​ వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల అనారోగ్యంతో ఉన్నానని.. పదిరోజుల తర్వాత వస్తానని ఉమ సీఐడీ వాళ్లకు లేఖ రాశారు. అయినప్పటికీ సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు అంటించారు. రేపు కర్నూలులోని సీఐడీ కార్యాలయానికి రావాల్సిందేనని పేర్కొన్నారు.

గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు.
సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారని దేవినేని ఉమ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.దేవినేని ఉమపై 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మార్ఫింగ్‌ చేసిన వీడియోను ప్రదర్శించిన సెల్‌ఫోన్‌, ట్యాబ్‌ను విచారణకు వచ్చే సమయంలో వెంట తీసుకురావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. ఉమకు నోటీసులు రావడంపై టీడీపీ నేతలు స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని వాళ్లు ఆరోపించారు.

First Published:  18 April 2021 1:59 AM GMT
Next Story