Telugu Global
NEWS

సాగర్​లో పోలింగ్​ ప్రారంభం.. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు..!

నాగార్జున సాగర్​ నియోజకవర్గానికి ఇవాళ పోలింగ్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజలు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని బూత్​లలో ఈవీఎంలు మొరాయించినట్టు సమాచారం. ఎండ, కోవిడ్​ భయంతో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవడం లేదు. మరోవైపు గ్రామాల్లో లీడర్లు.. ఓటర్లను పోలింగ్​ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. పోలింగ్​ సిబ్బంది కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్​ కేంద్రం వద్ద శానిటైజర్​, మాస్కులు అందుబాటులో ఉంచారు. తెలంగాణ […]

సాగర్​లో పోలింగ్​ ప్రారంభం.. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు..!
X

నాగార్జున సాగర్​ నియోజకవర్గానికి ఇవాళ పోలింగ్​ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోలింగ్​ ప్రారంభమైంది. ప్రజలు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అయితే కొన్ని బూత్​లలో ఈవీఎంలు మొరాయించినట్టు సమాచారం. ఎండ, కోవిడ్​ భయంతో ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్​ కేంద్రాలకు చేరుకోవడం లేదు.

మరోవైపు గ్రామాల్లో లీడర్లు.. ఓటర్లను పోలింగ్​ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. పోలింగ్​ సిబ్బంది కూడా కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్​ కేంద్రం వద్ద శానిటైజర్​, మాస్కులు అందుబాటులో ఉంచారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో రాత్రి ఏడు గంటలవరకు పోలింగ్​ జరగునున్నట్టు సమాచారం.

సాగర్‌ ఉపఎన్నికలో మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి నోముల భగత్‌, కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్‌ బరిలో ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

త్రిపురారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 265 లో, గుర్రం పూడ్ మండల కేంద్ర పరిధిలోని వట్టి కోడ్ 13 వ బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఆయన ఓటేశారు.

First Published:  17 April 2021 12:13 AM GMT
Next Story