Telugu Global
National

ఈ టైంలో.. సీనియర్స్ ఇలా సేఫ్..

సెకండ్ వేవ్ లో రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ టైంలో అందరికంటే జాగ్రత్తగా ఉండాల్సింది వయసుపైబడినే వాళ్లేనని నిపుణులు చెప్తున్నారు. ఈ టైంలో వయసుపైబడిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు. అవేంటంటే.. ఈ టైంలో వృద్ధులు హెల్దీగా ఉండడం ఎంత ముఖ్యమో.. ఒత్తిడి లేకుండా ప్రశాతంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. వయసు యాభై దాటగానే మానసిక సమస్యలు పెరుగుతుండడం సహజం. అయితే.. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యం మీద […]

ఈ టైంలో.. సీనియర్స్ ఇలా సేఫ్..
X

సెకండ్ వేవ్ లో రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ టైంలో అందరికంటే జాగ్రత్తగా ఉండాల్సింది వయసుపైబడినే వాళ్లేనని నిపుణులు చెప్తున్నారు. ఈ టైంలో వయసుపైబడిన వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు. అవేంటంటే..

ఈ టైంలో వృద్ధులు హెల్దీగా ఉండడం ఎంత ముఖ్యమో.. ఒత్తిడి లేకుండా ప్రశాతంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. వయసు యాభై దాటగానే మానసిక సమస్యలు పెరుగుతుండడం సహజం. అయితే.. మానసిక ఒత్తిళ్లు శారీరక ఆరోగ్యం మీద నెగెటివ్ ప్రభావాన్ని చూపుతాయి. అందులోనూ ఈ టైంలో ఎంతో రిలాక్స్‌డ్‌గా పాజిటివ్ గా ఉండడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు మరింత పాజిటివ్‌గా, ధైర్యంగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు హెల్దీ ఫుడ్ తింటూ, కంటికి సరిపడా నిద్రపోతూ, ఎంతో కొంత వ్యాయామం చేస్తూ ఉండాలి.

– డయాబెటిస్, బీపీ, ఆస్తమా లాంటివి ఉన్న వృద్ధులు వారి మెడిసిన్‌ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి. రోజూ వాడే మందులను ఎట్టిపరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు.
– తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం చేసుకోకుండా ముఖాన్ని తాకకూడదు. ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. ఈ టైంలో సొంత వైద్యం అంత మంచిది కాదు. ఈ టైంలో నార్మల్ మెడికల్ టెస్ట్‌ల కోసం హాస్పిటల్‌కు వెళ్లకపోవడమే బెటర్. వీలైనంత వరకు.. ఫోన్‌లోనే డాక్టర్ సలహా తీసుకోవాలి.
– సాధారణంగా.. వృద్ధుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం, షుగర్, బీపీ, ఆస్తమా లాంటి సమస్యల వల్ల రిస్క్ ఎక్కువగా ఉండొచ్చు.
– వృద్ధులు ఉండే ఇంట్లో డోర్లు, టేబుల్స్‌ను రెగ్యులర్‌‌గా శానిటైజ్ చేస్తూ ఉండాలి.
– ఆస్తమా ఉన్న వృద్ధులు ఇన్‌హేలర్‌‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.
– టైప్ వన్, టైప్ టూ డయాబెటిస్ ఉన్న వృద్ధులు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకుంటుండాలి.
– హై బ్లడ్ ప్రెజర్, శ్వాస సమస్యలు ఉన్నవాళ్లు కూడా వైరస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పొగతాగేవాళ్లు ఈ టైంలో స్మోకింగ్ కు దూరంగా ఉండడం మంచిది.

First Published:  17 April 2021 5:17 AM GMT
Next Story