Telugu Global
NEWS

త్వరలోనే రాజధానిగా విశాఖ

విశాఖపట్టణం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్​ పరిపాలనా రాజధాని కాబోతున్నదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఉత్తరాంధ్రలో జాబ్​ మేళాలు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ నెల 24 నుంచి మే 2 వరకు జాబ్​మేళాలు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. 24న విశాఖపట్నం ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాల్‌లో, 25న పార్వతీపురంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌లో, […]

త్వరలోనే రాజధానిగా విశాఖ
X

విశాఖపట్టణం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్​ పరిపాలనా రాజధాని కాబోతున్నదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఉత్తరాంధ్రలో జాబ్​ మేళాలు నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు.

ఈ నెల 24 నుంచి మే 2 వరకు జాబ్​మేళాలు ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. 24న విశాఖపట్నం ఆర్కే బీచ్‌ రోడ్డులోని ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాల్‌లో, 25న పార్వతీపురంలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌లో, మే 2న శ్రీకాకుళంలోని ఆనందమయి కన్వెన్షన్‌ హాల్‌లో జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎస్సెస్సీ, ఇంటర్​, డిగ్రీ, బీటెక్​, ఫార్మసీ ఇలా అన్ని స్థాయిల వాళ్లకు ఉద్యోగ​అవకాశాలు కల్పించబోతున్నట్టు చెప్పారు. 23 నుంచి 38 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 50కి పైగా కంపెనీలు ఈ జాబ్​ మేళాలో పాల్గొంటాయని అర్హులైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారన్నారు. కరోనా నేపథ్యంలో ఆన్​లైన్​లోనే ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు.

ఆన్​లైన్​లో కూడా దరఖాస్తులు స్వీకరించబోతున్నారని వివరించారు. జాబ్​మేళాకు వచ్చే అవకాశం లేనివాళ్లు ఆన్​లైన్​ లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అయితే అమ్మాయిలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు చెప్పారు. 70 నుంచి 75 శాతం ఉద్యోగాలు వాళ్లకే ఇవ్వబోతున్నామన్నారు. దశలవారీగా వివిధ జిల్లాల్లో ఉద్యోగమేళాలు నిర్వహిస్తామన్నారు.

గెలుపు కాదు మెజార్టీ ఎంత అన్నదే ప్రశ్న?

తిరుపతిలో వైఎస్సార్​ కాంగ్రెస్​ గెలుపు ఎప్పుడో ఖాయమైందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, మీడియా మొత్తం తమ మెజార్టీ ఎంత అన్న విషయంపైనే చర్చించుకుంటున్నారని చెప్పారు.
ఉద్యోగ కల్పన సీఎం జగన్మోహన్​రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే అనేకమందికి వలంటీర్లుగా అవకాశం దక్కిందని.. ఇతర ఉద్యోగాలు కూడా వేగవంతంగా భర్తీ చేస్తున్నట్టు చెప్పారు.

విశాఖ పట్టణం సుందర నగరం కాబోతున్నదని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. విశాఖ పరిపాలనా రాజధాని అయ్యి తీరుతుందన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు విశేషంగా కృషిచేస్తామన్నారు.
త్వరలో భోగాపురం ఎయిర్​పోర్టుకు భూమి పూజ నిర్వహిస్తామన్నారు. అలాగే విశాఖకు ఆరు లేన్ల రోడ్డు కూడా రాబోతున్నదని చెప్పారు.

తిరుపతిలో వైఎస్సార్​ కాంగ్రెస్​ గెలుపు ఎప్పుడో ఖాయమైందని.. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చిన్న గులకరాయి తన మీద వేయించుకొని హత్యాయత్నం జరిగినట్టు చిత్రీకరించుకున్నారని.. సొంత మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయించుకున్నారని విమర్శించారు. నిజంగా హత్యయత్నం చేయాలని భావించేవాళ్లు అంత చిన్న రాయితో ఎందుకు కొడతారని ప్రశ్నించారు. తిరుపతిలో ఉనికి కోసమే టీడీపీ పోటీచేస్తుందని విమర్శించారు. రికార్డు స్థాయి మెజార్టీతో తిరుపతి పార్లమెంట్​లో గెలవబోతున్నమని స్పష్టం చేశారు.

First Published:  16 April 2021 11:36 AM GMT
Next Story