Telugu Global
National

రెండోసారి రావడం తక్కువేనట!

ప్రపంచవ్యాప్తంగా సెకండ్, థర్డ్‌ వేవ్‌ కరోనా వ్యాపిస్తున్న అన్ని దేశాల్లో రీఇన్ఫెక్షన్‌ చాలా తక్కువగా ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఒకసారి వైరస్ సోకిన వారికి రెండోసారి సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో కేవలం ముగ్గురికే సెకండ్‌ వేవ్‌లో సోకే అవకాశం ఉందని తాజా సర్వేలో వెల్లడైంది. యూరోపియన్‌ యూనియన్‌ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం సెకండ, థర్డ్ వేవ్ ఇన్ఫెక్షన్లపై స్టడీ చేసి ఓ నివేదిక […]

రెండోసారి రావడం తక్కువేనట!
X

ప్రపంచవ్యాప్తంగా సెకండ్, థర్డ్‌ వేవ్‌ కరోనా వ్యాపిస్తున్న అన్ని దేశాల్లో రీఇన్ఫెక్షన్‌ చాలా తక్కువగా ఉంటుందని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఒకసారి వైరస్ సోకిన వారికి రెండోసారి సోకే అవకాశాలు తక్కువగా ఉన్నాయట. ఫస్ట్‌ వేవ్‌లో కరోనా వచ్చిన ప్రతి వెయ్యి మందిలో కేవలం ముగ్గురికే సెకండ్‌ వేవ్‌లో సోకే అవకాశం ఉందని తాజా సర్వేలో వెల్లడైంది.

యూరోపియన్‌ యూనియన్‌ వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం సెకండ, థర్డ్ వేవ్ ఇన్ఫెక్షన్లపై స్టడీ చేసి ఓ నివేదిక విడుదల చేసింది. ఒకసారి సోకిన వారికి రెండోసారి సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు ఆ సర్వేలో పేర్కొంది. అలాగే వ్యాక్సిన్‌ వేసుకున్న వెయ్యి మందిలో ఇద్దరికి మాత్రమే కరోనా సోకుతున్నట్టు గుర్తించింది.

అలాగే వ్యాక్సిన్‌ వేసుకున్నవారికి కరోనా వస్తే.. పరిస్థితి సీరియస్‌ కాకుండా రక్షణ కల్పిస్తుందని కూడా సర్వే తెలిపింది.

First Published:  15 April 2021 4:23 AM GMT
Next Story