Telugu Global
NEWS

రాళ్లదాడి, క్వారంటైన్ రెండూ నాటకాలే.. " అంబటి

తిరుపతి ఉప ఎన్నిక వేళ టీడీపీ రాళ్లదాడి అంటూ నాటకాలాడిందని తీవ్రంగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. తిరుపతిలో టీడీపీకి 25శాతం నుంచి 30శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వేలు తేల్చి చెప్పడంతో, రాళ్లదాడి ఎపిసోడ్ లో చంద్రబాబు రసవత్తరంగా నటించారని ఎద్దేవా చేశారు. రాళ్లదాడి ఎవరు చేశారో ఇంతవరకు తేలలేదని, కనీసం దాడి జరిగినప్పుడు ఒక్క కెమెరాలో కూడా అది రికార్డ్ కాలేదని, రాయిమీద పడి గాయపడినవారు కూడా లేరని అన్నారు. ఇటు గవర్నర్ […]

రాళ్లదాడి, క్వారంటైన్ రెండూ నాటకాలే..  అంబటి
X

తిరుపతి ఉప ఎన్నిక వేళ టీడీపీ రాళ్లదాడి అంటూ నాటకాలాడిందని తీవ్రంగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. తిరుపతిలో టీడీపీకి 25శాతం నుంచి 30శాతం మాత్రమే ఓట్లు వస్తాయని సర్వేలు తేల్చి చెప్పడంతో, రాళ్లదాడి ఎపిసోడ్ లో చంద్రబాబు రసవత్తరంగా నటించారని ఎద్దేవా చేశారు. రాళ్లదాడి ఎవరు చేశారో ఇంతవరకు తేలలేదని, కనీసం దాడి జరిగినప్పుడు ఒక్క కెమెరాలో కూడా అది రికార్డ్ కాలేదని, రాయిమీద పడి గాయపడినవారు కూడా లేరని అన్నారు. ఇటు గవర్నర్ కి, అటు కేంద్ర ఎన్నికల సంఘానికి మరుసటి రోజే ఫిర్యాదులు వెళ్లాయంటే.. అదంతా పగడ్బందీగా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఎద్దేవా చేశారు. అచ్చెన్నాయుడికి కూడా పార్టీ పరిస్థితి ముందే తెలుసని, అందుకే ఆయన తిరుపతి హోటల్ లో “ఈనెల 17 తర్వాత పార్టీ లేదు, బొక్కా లేదు” అంటూ కామెంట్లు చేశారని చెప్పారు. అచ్చెన్నాయుడికి సంబంధించిన వీడియోలను అంబటి రాంబాబు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. టీడీపీ పనైపోయిందని సాక్షాత్తూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడే తేల్చి చెప్పారని అన్నారు.

ప్యాకేజీ అందకే క్వారంటైన్ డ్రామా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చిన ఉప ఎన్నికల ప్రచార సభకు, పవన్ కల్యాణ్ రాకపోవడం వెనక బలమైన కారణం ఉందని అన్నారు అంబటి రాంబాబు. కరోనా భయంతో క్వారంటైన్ లో ఉన్నారని చెప్పడం అబద్ధమని, ఆయనకు ప్యాకేజీ అందలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై జేపీ నడ్డా ఆరోపణలు చేయడం దుర్మార్గం అని అన్నారు అంబటి. నడ్డా టీడీపీ అధ్యక్షుడి స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకూ 14 సార్లు ఢిల్లీ వెళ్లారని, ప్రధానితో 6 సార్లు సమావేశమయ్యారని, 33 లేఖలు రాశారని, హోంమంత్రి అమిత్‌ షాతో 9 సార్లు సమావేశమయ్యారని, అయినా రాష్ట్ర సమస్యలు కేంద్రానికి పట్టడంలేదని విమర్శించారు అంబటి. విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని చెప్పారు. ప్రధాని మోదీ ఒక్క సంతకం చేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని, అది పక్కనపెట్టి, తిరుపతిలో అభివృద్ధి అంటూ డ్రామాలాడుతున్నారని బీజేపీపై మండిపడ్డారు.

First Published:  13 April 2021 10:40 PM GMT
Next Story