Telugu Global
NEWS

తిరుపతి ప్రచారంలో రాళ్లదాడి కలకలం..

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్ షో లో ప్రసంగిస్తున్న చంద్రబాబు తమపై రాళ్లదాడి జరిగిందని ఆరోపించడం సంచలనంగా మారింది. రాళ్లదాడి వల్ల తమ నేతలు గాయపడ్డారని చెప్పిన ఆయన, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఫైట్ చేయాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాట తీస్తా, తోలు తీస్తానంటూ ఘాటుగా మాట్లాడారు. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేస్తున్నారని మండిపడిన చంద్రబాబు, పోలీసుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు సహా […]

తిరుపతి ప్రచారంలో రాళ్లదాడి కలకలం..
X

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో రోడ్ షో లో ప్రసంగిస్తున్న చంద్రబాబు తమపై రాళ్లదాడి జరిగిందని ఆరోపించడం సంచలనంగా మారింది. రాళ్లదాడి వల్ల తమ నేతలు గాయపడ్డారని చెప్పిన ఆయన, దమ్ముంటే ఎదురుగా వచ్చి ఫైట్ చేయాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాట తీస్తా, తోలు తీస్తానంటూ ఘాటుగా మాట్లాడారు. టీడీపీ నాయకులపై హత్యాయత్నం చేస్తున్నారని మండిపడిన చంద్రబాబు, పోలీసుల సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. అచ్చెన్నాయుడు, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు సహా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా కొంతసేపు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అనంతరం తిరుపతి ఎస్పీ ఆఫీస్ వరకు కాలి నడకన వచ్చిన చంద్రబాబు రాళ్లదాడి వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.

చచ్చినపాముని కర్రతో కొట్టాలా..?
టీడీపీ రాళ్లదాడి ఆరోపణలను అంతే ఘాటుగా తిప్పికొట్టారు వైసీపీ నేతలు. తిరుపతి ఉప ఎన్నికల్లో సానుభూతికోసం చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాళ్లదాడిలో గాయపడ్డవారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. సరిగ్గా మీటింగ్ ముగిసే సమయంలో రాళ్లదాడి జరిగిందని చంద్రబాబు హడావిడి చేయడం, ఆ తర్వాత టీడీపీ నాయకులు విమర్శలు చేయడం, వారి అనుకూల మీడియా వరసబెట్టి కథనాలు ప్రసారం చేయడం అంతా ఓ ప్రణాళిక ప్రకారం జరిగిందని అన్నారాయన. పోలీసులు విచారణ జరిపి, ఈ నాటకానికి సూత్రధారులెవరో కనిపెట్టాలని, తమ పార్టీ వారి పాత్ర ఉందని తేలితే వారిని తామే పట్టిస్తామని చెప్పారు. చచ్చిన పామును కర్రలతో కొట్టాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు పెద్దిరెడ్డి.

చెప్పులదాడి, రాళ్లదాడికి ఆద్యుడు బాబే..
టీడీపీని దక్కించుకునేందుకు గతంలో మామ ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన నీచ సంస్కృతి చంద్రబాబుదేనని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత తిరుపతిలో అమిత్ ‌షా మీద రాళ్లు వేయించి లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి కూడా చంద్రబాబే అన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే టీడీపీ ఈ నాటకానికి తెరతీసిందని విమర్శించారాయన.

First Published:  12 April 2021 10:21 PM GMT
Next Story