Telugu Global
National

భారత్ లో వినియోగానికి మూడో వ్యాక్సిన్ రెడీ..

స్పుత్నిక్ -వి టీకాకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి లభించింది. దీంతో రష్యా తయారీ స్పుత్నిక్ టీకా త్వరలోనే భారత్ లో అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ప్రస్తుతం భారత్ లో వినియోగిస్తున్న కొవాక్సిన్, కొవిషీల్డ్ సరసన స్పుత్నిక్-వి కూడా చేరబోతోంది. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ని మరింత వేగవంతం చేయాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. టీకా ఉత్సవ్ పేరుతో మరింత మందికి వ్యాక్సిన్ చేరువ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే […]

భారత్ లో వినియోగానికి మూడో వ్యాక్సిన్ రెడీ..
X

స్పుత్నిక్ -వి టీకాకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి లభించింది. దీంతో రష్యా తయారీ స్పుత్నిక్ టీకా త్వరలోనే భారత్ లో అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమం అయింది. ప్రస్తుతం భారత్ లో వినియోగిస్తున్న కొవాక్సిన్, కొవిషీల్డ్ సరసన స్పుత్నిక్-వి కూడా చేరబోతోంది.
భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ ని మరింత వేగవంతం చేయాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. టీకా ఉత్సవ్ పేరుతో మరింత మందికి వ్యాక్సిన్ చేరువ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ కొరత కూడా కలవరపెట్టే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో కొవాక్సిన్, కొవిషీల్డ్ తోపాటు, మరో ఐదు కంపెనీలకు అనుమతివ్వాలని కేంద్రం భావించింది.

రష్యా తయారీ స్పుత్నిక్ -వి ఒకటి కాగా.. బయొలాజికల్-ఇ పేరుతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేస్తున్న టీకా మరొకటి. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెస్తున్న నొవావాక్స్, జైడస్ క్యాడిలా వ్యాక్సిన్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాజల్ వ్యాక్సిన్ కి అనుమతులిచ్చే విషయంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వీటిలో తొలిగా స్పుత్నిక్-వి వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తుది అనుమతి ఇస్తే.. స్పుత్నిక్-వి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెండ్ ఫండ్ అభివృద్ధి చేసిన ఈ స్పుత్నిక్-వి టీకాను భారత్‌ లో ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే ఈ టీకాకు సంబంధించి మనదేశంలో రెండు, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఆ పరీక్షల భద్రత, రోగనిరోధకత సమాచారాన్ని ఇప్పటికే డీసీజీఐకి అందించింది డాక్టర్ రెడ్డీస్ సంస్థ. అనుమతులు మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసింది. ఈ డేటాను విశ్లేషించిన నిపుణుల బృందం అత్యవసర వినియోగానికి కేంద్రానికి సిఫార్సు చేసింది.

First Published:  12 April 2021 5:50 AM GMT
Next Story