Telugu Global
Cinema & Entertainment

మహాగా మారిన అదితి

మొద‌టి చిత్రం ఆర్‌ఎక్స్ 100తో సూప‌ర్‌హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హా స‌ముద్రం. అదితిరావు హైద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ఆమె పాత్ర పేరు మ‌హా. అలాగే లోతైన ఆలోచనలతో కన్నీళ్లతో క‌నిపిస్తున్న ఆమె లుక్ ఆక‌ట్టుకుంటోంది. ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ప్ర‌స్టేజియ‌స్ గా తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీలో శ‌ర్వానంద్‌, సిద్దార్ద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. […]

aditi mahasamudram
X

మొద‌టి చిత్రం ఆర్‌ఎక్స్ 100తో సూప‌ర్‌హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి తెర‌కెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ మ‌హా స‌ముద్రం. అదితిరావు హైద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో ఆమె పాత్ర పేరు మ‌హా. అలాగే లోతైన ఆలోచనలతో కన్నీళ్లతో క‌నిపిస్తున్న ఆమె లుక్ ఆక‌ట్టుకుంటోంది.

ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి ప్ర‌స్టేజియ‌స్ గా తెర‌కెక్కిస్తోన్న ఈ మూవీలో శ‌ర్వానంద్‌, సిద్దార్ద్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంటెన్స్ ల‌వ్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. మ‌రో కీల‌క పాత్ర‌లో హీరోయిన్‌ అనూ ఇమాన్యుల్ న‌టిస్తోంది.

చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేఎల్ ప్ర‌వీణ్ ఎడిట‌ర్‌, కొల్ల అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఆగ‌స్ట్‌19న మ‌హాస‌ముద్రం చిత్రాన్ని విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.

First Published:  12 April 2021 8:12 AM GMT
Next Story