Telugu Global
National

సోనూ ఔదార్యం..పిల్లల కోసం టవర్​ ఏర్పాటు

ప్రముఖ నటుడు సోనూ సుద్​.. లాక్​డౌన్​ లో రియల్​ హీరో అనిపించుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్న పేదలకు తన వంతు సాయం అందజేసి .. వాళ్లను ఆదుకున్నారు. దీంతో సోనూ పేరు సోషల్​మీడియాలో మారు మోగిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నట్టు సోనూ చెవిన పడిన వెంటనే వాళ్లకు తన వంతు సాయం చేశారు. లాక్​డౌన్​ టైంలో ఉపాధి కోల్పోయిన ఎందరికో సోనూ సాయం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు. ఉపాధి కూలీలకు […]

సోనూ ఔదార్యం..పిల్లల కోసం టవర్​ ఏర్పాటు
X

ప్రముఖ నటుడు సోనూ సుద్​.. లాక్​డౌన్​ లో రియల్​ హీరో అనిపించుకున్నారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్న పేదలకు తన వంతు సాయం అందజేసి .. వాళ్లను ఆదుకున్నారు. దీంతో సోనూ పేరు సోషల్​మీడియాలో మారు మోగిపోయింది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు కష్టాల్లో ఉన్నట్టు సోనూ చెవిన పడిన వెంటనే వాళ్లకు తన వంతు సాయం చేశారు.

లాక్​డౌన్​ టైంలో ఉపాధి కోల్పోయిన ఎందరికో సోనూ సాయం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారు. ఉపాధి కూలీలకు డబ్బులు పంపారు. మొత్తానికి ప్రభుత్వాలు చేయాల్సిన పనిని సోనూ చేశారు.తాజాగా సోనూ సుద్​ ఓ ఊర్లోని విద్యార్థులు ఇంటర్​నెట్​ లేక ఇబ్బందులు పడుతుండటంతో వాళ్లకు ఏకంగా టవర్​ ఏర్పాటు చేయించి ఔదార్యాన్ని చాటుకున్నారు.

కరోనా కారణంగా చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కొనసాగడం లేదు. విద్యార్థులు ఇంటి దగ్గరే ఉంటూ ఆన్​లైన్​ క్లాసులు వింటున్నారు. పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్నారు. నాగ్‌పూర్ కు సమీపంలోని గొడియా జిల్లాలోని ఓ గ్రామ విద్యార్థులకు ఇంటర్​నెట్​ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్​లైన్​ క్లాసులు వినలేకపోతున్నారు.

ఈ విషయం సోనూ చెవిన పడింది. ఓ నెటిజన్​ ఈ విషయాన్ని సోనూ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఆ గ్రామంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేసేశారు. కొన్ని గంటల్లోనే గ్రామానికి సెల్​ టవర్​ రావడంతో గ్రామస్థులంతా సంతోష పడుతున్నారు. అనంతరం ఆ ఊరి ప్రజలతో సోనూ వీడియో కాల్​లో మాట్లాడారు. విద్యార్థులకు అండగా నిలిచిన సోనూపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

First Published:  11 April 2021 12:13 AM GMT
Next Story