Telugu Global
Health & Life Style

సమ్మర్ లో ఈ మిస్టేక్స్ చేయొద్దు..

ఇప్పుడు మిడ్ సమ్మర్ నడుస్తోంది. బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే సమ్మర్ లో ఆటోమేటిగ్గా లైఫ్ స్టైల్ లో మారిపోతుంది. తీసుకునే ఆహారం, ఇంటి వాతావరణం ఇలా అన్నింటిలో మార్పులొస్తాయి. ఇలాంటి సమయంలోనే జాగ్రత్తల పేరుతో కొన్ని మిస్టేక్స్ చేస్తాం. అవి మనల్ని అనారోగ్యానికి దారితీయొచ్చు. అలాంటి కొన్ని మిస్టేక్స్ ఏంటంటే.. ఎక్కువ నీళ్లు.. కొంతమంది సమ్మర్ లో ఎక్కువగా నీళ్లు తాగాలనే ఉద్దేశంతో మరీ ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా తాగడం ప్రమాదమని చెప్తున్నారు డాక్టర్లు. రోజుకు […]

సమ్మర్ లో ఈ మిస్టేక్స్ చేయొద్దు..
X

ఇప్పుడు మిడ్ సమ్మర్ నడుస్తోంది. బయట ఎండలు మండిపోతున్నాయి. అయితే సమ్మర్ లో ఆటోమేటిగ్గా లైఫ్ స్టైల్ లో మారిపోతుంది. తీసుకునే ఆహారం, ఇంటి వాతావరణం ఇలా అన్నింటిలో మార్పులొస్తాయి. ఇలాంటి సమయంలోనే జాగ్రత్తల పేరుతో కొన్ని మిస్టేక్స్ చేస్తాం. అవి మనల్ని అనారోగ్యానికి దారితీయొచ్చు. అలాంటి కొన్ని మిస్టేక్స్ ఏంటంటే..

ఎక్కువ నీళ్లు..
కొంతమంది సమ్మర్ లో ఎక్కువగా నీళ్లు తాగాలనే ఉద్దేశంతో మరీ ఎక్కువగా తాగేస్తుంటారు. ఇలా తాగడం ప్రమాదమని చెప్తున్నారు డాక్టర్లు. రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి లేదా దాహం అనిపించిన ప్రతిసారి ఓ గ్లాసు నీళ్లు తాగుతూ ఉండాలి. అలా కాకుండా అవసరానికి మించి నీళ్లు తాగితే హైపోనెట్రేమియా అనే సమస్య మొదలవుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. మరీ ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా శరీరంలో ఉండే ద్రవాలు పలుచగా మారి, సోడియం లెవల్స్ పడిపోయే ప్రమాదముంది. అందుకే అవసరానికి మించి నీటిని తీసుకోకూడదు. శరీరానికి నీటి అవసరం ఉన్నప్పుడు ఆ సిగ్నల్స్ దాహం రూపంలో మనకు అందుతాయి. కాబట్టి దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగడం ఉత్తమం.

వ్యాయామం
సమ్మర్ లో వ్యాయామాలు పొద్దున్నే లేదా సాయంత్రం సూర్యుడి లేని సమయంలో, చల్లగా ఉన్న టైంలో చేయడం మంచిది. ఉదయం తొమ్మిది, పది గంటలకు వ్యాయామం చేసే అలవాటున్నవాళ్లు సమ్మర్ లో ఆ అలవాటును మానుకోవడం మంచిది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడం ద్వారా ఎక్కువగా ఎనర్జీ లాస్ అయ్యి, నీరసం వస్తుంది కాబట్టి ఎండ మొదలు కాకముందే వ్యాయామం చేయడం బెటర్.

ఏసీ వాడకం
సమ్మర్ లో ఏసీల వాడకం ఎంత ఎక్కువగా ఉంటుందో తెలిసిందే.. అయితే ఏసీ టెంపరేచర్ మన శరీరానికి తగ్గట్టుగా.. 23 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో ఉంచుకోవాలి. 16 లేదా 18 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు గడపడం అంత మంచిది కాదు. ఏసీని 16 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంచినప్పుడు గది ఉష్ణోగ్రత సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. దీనిద్వారా అర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలు రావొచ్చు. అలాగే.. ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు చెమట పట్టదు. కాబట్టి శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. ఇలా ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా దీర్ఘకాలిక స్కిన్ అలెర్జీలు, దురదలు వచ్చే ప్రమాదముంది. అందుకే ఏసీని సాధారణ శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువ ఉండేలా సెట్ చేసుకోవాలి. 23 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటే సేఫ్.

First Published:  10 April 2021 3:10 AM GMT
Next Story