Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ మూవీ రివ్యూ

నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేత థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కెమెరామెన్ : పి.ఎస్.వినోద్ సంగీతం : థమన్ నిర్మాతలు: రాజు, శిరీష్ మాటలు-మార్పులు-దర్శకత్వం : శ్రీరామ్ వేణు విడుదల తేది : 9 ఏప్రిల్ 2021 రేటింగ్: 3/5 ప్రతి రీమేక్ కు హిట్టయ్యే అర్హత ఉంటుంది. ఎటొచ్చి దాన్ని సరైన పద్ధతిలో తీయాలి. తెలుగు ఆడియన్స్ అభిరుచి కోసం, హీరో ఇమేజ్ కోసం చేసే మార్పులు-ప్రయోగాలు ఒక్కోసారి వికటిస్తుంటాయి. ఎక్కువ […]

వకీల్ సాబ్ మూవీ రివ్యూ
X

నటీనటులు: పవన్ కళ్యాణ్, శృతిహాసన్, నివేత థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు
కెమెరామెన్ : పి.ఎస్.వినోద్
సంగీతం : థమన్
నిర్మాతలు: రాజు, శిరీష్
మాటలు-మార్పులు-దర్శకత్వం : శ్రీరామ్ వేణు
విడుదల తేది : 9 ఏప్రిల్ 2021
రేటింగ్: 3/5

ప్రతి రీమేక్ కు హిట్టయ్యే అర్హత ఉంటుంది. ఎటొచ్చి దాన్ని సరైన పద్ధతిలో తీయాలి. తెలుగు ఆడియన్స్ అభిరుచి కోసం, హీరో ఇమేజ్ కోసం చేసే మార్పులు-ప్రయోగాలు ఒక్కోసారి వికటిస్తుంటాయి. ఎక్కువ శాతం రీమేక్స్ ఫెయిల్ అవ్వడానికి అదే రీజన్. వకీల్ సాబ్ విషయంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చాలానే జరిగాయి. కాకపోతే కేవలం 20 శాతం మాత్రమే ఫెయిల్ అవ్వడం, మిగతా 80శాతం ప్రయోగాలు క్లిక్ అవ్వడంతో వకీల్ సాబ్ గట్టెక్కిపోయాడు.

రీమేక్ కాబట్టి సినిమా కథ గురించి చాలామందికి తెలుసు. కాబట్టి ముందుగా మార్పుచేర్పుల గురించి మాట్లాడుకుందాం. పింక్ లో అమితాబ్ బచ్చన్ పాత్రలో మచ్చుకు కూడా హీరోయిజం కనిపించదు. ఇక తమిళ్ లో తీసిన నార్కొండ పావైలో కూడా హీరో చాలాచోట్ల పాసివ్ గా కనిపిస్తాడు. కానీ ఇదే రీమేక్ తెలుగులోకి వచ్చేసరికి మాత్రం ఎగ్రెసివ్ అయిపోతాడు. ఫైట్స్ చేస్తాడు, డ్యూయట్స్ కూడా పాడతాడు.

పవన్ కోసం వేణుశ్రీరామ్ చేసిన మార్పులు అతడి అభిమానులతో పాటు జనసైనికులకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతాయి. జనసైనికులు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పామంటే, ఇందులో ఉన్న పొలిటికల్ టచ్ డైలాగ్స్ అలాంటివి మరి. ఇక ఈ మార్పులతో కామన్ ఆడియన్స్ కూడా దాదాపు కనెక్ట్ అవుతారు. కాబట్టి వకీల్ సాబ్ హిట్టయిపోయినట్టే. పింక్ లాంటి కథలో కూడా వేణుశ్రీరామ్ 4 ఫైట్లు ఇరికించాడంటే ఏ రేంజ్ లో మార్పుచేర్పులు జరిగాయో అర్థంచేసుకోవచ్చు.

అయితే ఈ మార్పుచేర్పుల్లో అస్సలు నచ్చని, ఎక్కని ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది పవన్ కల్యాణ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే. పవన్ ను స్టూడెంట్ లీడర్ గా చూపించడం వరకు ఓకే. శృతిహాసన్ ఎపిసోడ్స్ మాత్రం అటు ప్రేక్షకుల్ని, ఇటు పవన్ ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయాయి. ఆ ఒక్కటి ట్రిమ్ చేయమంటూ అభిమానుల నుంచి అప్పుడే విజ్ఞప్తులు కూడా మొదలయ్యాయంటే, సినిమాను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎంతలా వెనక్కి లాగేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

మార్పుచేర్పులు అయిపోయాయి, ఇప్పుడు కథలోకి వెళ్దాం. హైదరాబాద్ లో ఓ కాలనీలో ఉంటూ వర్క్ చేసుకునే పల్లవి(నివేత థామస్) , జరీనా(అంజలి), దివ్య (అనన్య) అనుకోకుండా ఓ రాత్రి నలుగురు అబ్బాయిలతో రిసార్ట్స్ లో స్టే చేయాల్సి వస్తుంది. అందులో ఉన్న మంత్రి కొడుకు పల్లవిపై అత్యాచారానికి ప్రయత్నిస్తాడు. అతడ్ని గాయపరిచి ముగ్గురు అమ్మాయిలు అక్కడ్నించి తప్పించుకుంటారు. కానీ మంత్రి కొడుకు మాత్రం పల్లవిపై రివర్స్ లో కేసు పెడతాడు. అప్పటికే ఐదేళ్లు ప్రాక్టీస్ కు దూరంగా ఉన్న సత్యదేవ్ (పవన్) ఈ కేసును ఎలా పరిష్కరించాడనేది వకీల్ సాబ్ స్టోరీ.

పైన చెప్పుకున్న కథలో అసలు మేటర్ మొత్తం సెకెండాఫ్ లోనే కనిపిస్తుంది. కోర్టు డ్రామా అద్భుతంగా నడిచింది. ఇన్నాళ్లూ పవన్ యాక్టింగ్ ను వంకలు పెట్టేవాళ్లు ఎవరైనా ఉంటే కోర్టు రూమ్ లో అతడి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అఁత బాగా నటించాడు పవన్. ఇక పవన్ కు ప్రతివాదిగా ప్రకాష్ రాజ్ తన నటనతో ఎప్పట్లానే మెప్పించాడు. నివేత థామస్ ఓవరాల్ గా, అంజలి కోర్టు సీన్ లో మెప్పించారు. అనన్యకు నటించే స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు.

సినిమా ఫస్టాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, పవన్ ఎలివేషన్స్ కోసం మాత్రమే వాడుకున్నాడు దర్శకుడు. అందుకే అవి అక్కడక్కడ బోర్ కొట్టిస్తాయి. ఎప్పుడైతే సెకెండాఫ్ లోకి ఎంటరవుతాడో, అసలు పింక్ కథ స్టార్ట్ అవుతుంది. దాన్ని చెడగొట్టకుండా మక్కికిమక్కి దించడంలో, పవన్ తో ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు డైలాగ్స్ చెప్పించడంలో వేణుశ్రీరామ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే గంటకు పైగా నిడివి ఉన్న సెకండాఫ్ 10 నిమిషాల్లో పూర్తయినట్టు అనిపిస్తుంది. అంతలా కట్టిపడేశారు పవన్-వేణుశ్రీరామ్. ఇక్కడ వేణు శ్రీరామ్ డైలాగ్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే.

వీళ్లిద్దరి తర్వాత క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే అది తమన్ కే ఇవ్వాలి. తొలిసారి పవన్ సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్న తమన్, వకీల్ సాబ్ కోసం చాలా కష్టపడ్డాడనే విషయం సినిమా చూస్తే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రీ-రికార్డింగ్ లో తన టాలెంట్ మొత్తం బయటపెట్టాడు ఈ కంపోజర్. దీనికి సినిమాటోగ్రఫీ కూడా యాడ్ అయింది.

ఇలా అన్ని యాంగిల్స్ కలిసిరావడంతో వకీల్ సాబ్ సెకెండాఫ్ సూపర్ హిట్టయింది. ఆ హిట్ టాకే టోటల్ సినిమాకు శ్రీరామరక్షగా మారింది.

First Published:  9 April 2021 8:43 AM GMT
Next Story