Telugu Global
Health & Life Style

టీ, కాఫీల్లో ఏది బెటర్..?

మన దేశంలో టీ, కాఫీ అలవాటు లేని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఉదయాన్నే టీ లేదా కాఫీ ఏదో ఒకటి తాగాల్సిందే.. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంతకీ అసలు ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే.. టీ, కాఫీలను ఎంచుకోవడంలో చాలామంది రుచిపరంగా నచ్చినదాన్ని ఎంచుకుంటారు. కానీ వేరువేరు క్వాలిటీస్ కలిగిన ఈ రెండిటిలో ఏది ఎవరికి సూట్ అవుతుందంటే.. టీ […]

టీ, కాఫీల్లో ఏది బెటర్..?
X

మన దేశంలో టీ, కాఫీ అలవాటు లేని వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఉదయాన్నే టీ లేదా కాఫీ ఏదో ఒకటి తాగాల్సిందే.. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయంలో మాత్రం ఇప్పటికీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంతకీ అసలు ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే..
టీ, కాఫీలను ఎంచుకోవడంలో చాలామంది రుచిపరంగా నచ్చినదాన్ని ఎంచుకుంటారు. కానీ వేరువేరు క్వాలిటీస్ కలిగిన ఈ రెండిటిలో ఏది ఎవరికి సూట్ అవుతుందంటే..

టీ స్పెషాలిటీ ఇదీ..
మనకు లభించే రకరకాల టీల్లో బ్రెయిన్ ను స్టిమ్యులేట్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే టీ తాగడం వల్ల కొంతమందిలో తలనొప్పి తగ్గడం, అటెన్షన్ పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటు టీ తాగడం వల్ల చురుకుదనం పెరుగుతుందని, ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్టడీలు చెప్తున్నాయి. ఇకపోతే టీతో ఒక నష్టం కూడా ఉంది. అదేంటంటే.. టీ తాగడం వల్ల ఆహారం నుంచి ఐరన్ గ్రహించే శక్తి కొంత తగ్గుతుంది. టీ తాగితే 62శాతం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోయ్యే అవకాశం ఉంది.

కాఫీ ఎందుకంటే..
కాఫీని చాలామంది రుచి కోసం ఎంచుకుంటారు. అలాగే కొంతమంది కాఫీతో వెయిట్ లాస్ అవ్వొచ్చని తీసుకుంటారు. అయితే కాఫీలో ఉండే కెఫీన్ నిజంగానే వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది. అందుకే చాలామంది వర్కౌట్స్ కు ముందు బ్లాక్ కాఫీ తాగుతుంటారు. ఇకపోతే కాఫీతో గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యల రిస్క్ కూడా తగ్గుతుందని కొన్ని స్టడీలు చెప్తున్నాయి.

కాఫీతో కూడా కొన్ని నష్టాలున్నాయి. గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలను కాఫీ రెట్టింపు చేస్తుంది. అలాగే ఫిల్టర్ చేయని కాఫీ కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచే అవకాశం ఉంది.రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోవచ్చు.

ఏది బెటర్?
టీ, కాఫీ ల్లో ఏది తాగాలన్నా.. దాన్ని ఒకసారి మాత్రమే బాయిల్ చేసి తాగాలి. అప్పుడే అందులో ఉండే ఫ్లేవర్లు, యాంటీ ఆక్సిడెంట్లు పోకుండా ఉంటాయి. ఇక కెఫీన్ విషయానికొస్తే.. ఒక కప్పు బ్లాక్ టీలో 14-70మిల్లీ గ్రాముల కెఫీన్ ఉంటే.. కాఫీలో అయితే 95-200మిల్లీగ్రాములు ఉంటుంది. కెఫీన్ ఓవర్ డోస్ తో జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలనుకుంటే కాఫీ కంటే టీను ఎంచుకోవడం బెటర్. ఒక వేళ కాఫీని బాగా ఇష్టపడేవాళ్లైతే రోజుకు రెండు కప్పులకు మించకుండా తాగడం బెటర్.

First Published:  7 April 2021 4:26 AM GMT
Next Story