Telugu Global
National

మహారాష్ట్ర దారిలో మరిన్ని రాష్ట్రాలు.. అమలులోకి రాత్రి ఆంక్షలు..

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర ఇప్పటికే రాత్రి కర్ఫ్యూని రాష్ట్రవ్యాప్తంగా అమలులో పెట్టింది. శుక్ర, శని, ఆది వారాల్లో వారాంతపు కర్ఫ్యూకి ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ నిబంధన తెరపైకి తెచ్చింది. కేసుల సంఖ్య బారీగా పెరుగుతున్న గుజరాత్ కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. గుజరాత్ లోని 20 ముఖ్య పట్టణాల్లో రాత్రి 10నుంచి ఉదయం 8గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో పెడుతూ ఉత్తర్వులిచ్చారు. ఈనెల 30వరకు […]

మహారాష్ట్ర దారిలో మరిన్ని రాష్ట్రాలు.. అమలులోకి రాత్రి ఆంక్షలు..
X

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర ఇప్పటికే రాత్రి కర్ఫ్యూని రాష్ట్రవ్యాప్తంగా అమలులో పెట్టింది. శుక్ర, శని, ఆది వారాల్లో వారాంతపు కర్ఫ్యూకి ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ నిబంధన తెరపైకి తెచ్చింది. కేసుల సంఖ్య బారీగా పెరుగుతున్న గుజరాత్ కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. గుజరాత్ లోని 20 ముఖ్య పట్టణాల్లో రాత్రి 10నుంచి ఉదయం 8గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో పెడుతూ ఉత్తర్వులిచ్చారు. ఈనెల 30వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు సీఎం విజయ్ రూపానీ.

సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలులో పెట్టింది. రాత్రి 10నుంచి ఉదయం 5 గంటలవరకు ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని ఆదేశాలిచ్చింది. చత్తీస్ ఘడ్, రాజస్థాన్ కూడా అదే బాట పట్టాయి.

కరోనా తొలిదశలో కేంద్రం ముందుగా ఆంక్షలను తెరపైకి తెచ్చింది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. అయితే రెండో దశలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలిదశ లాక్ డౌన్ కష్టాలకు తానే ప్రధాన ముద్దాయి అనే ప్రచారం జరగడంతో.. రెండోదశలో ఆ భారాన్ని రాష్ట్రాలకే వదిలేశారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇటీవల రెండుసార్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయినా కూడా లాక్ డౌన్ పేరెత్తలేదు ప్రధాని. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని మాత్రమే సెలవిచ్చారు. కేసుల సంఖ్యపై ఆరా తీశారు.

మరోవైపు రాష్ట్రాలు మాత్రం తమ నిర్ణయాలను అమలులో పెట్టేందుకు తటపటాయిస్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ అనౌన్స్ చేసింది. అది కూడా కేవలం రాత్రి పూట మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మహారాష్ట్ర ఆదర్శంగా ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, చత్తీస్ ఘడ్ కూడా రాత్రి కర్ఫ్యూని అమలులో పెట్టాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు..?
తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఉన్నా కూడా.. ఉత్తరాది అంత ఉధృతి ఇక్కడ కనిపించడంలేదు. ఏపీ, తెలంగాణలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నా కూడా.. తొలిదశలో ఉన్నంత ప్రభావం ఇప్పుడు లేదు. దీంతో ప్రజలు కూడా కేసులు పెరుగుతున్నా సాధారణ జీవనానికే అలవాటు పడ్డారు. తెలంగాణ సర్కారు స్కూల్స్, కాలేజీలు మూసివేసినా, ఏపీలో ఆ పరిస్థితులు లేవు. ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు ఉంటాయని చెప్పలేం కానీ.. చేయి దాటితే.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నైట్ కర్ఫ్యూ విషయంలో సంకోచించే అవకాశం లేదు.

First Published:  7 April 2021 12:17 AM GMT
Next Story