Telugu Global
Cinema & Entertainment

సినిమా హాళ్లకు రాయితీలు.. సీఎం జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు..

కరోనా వల్ల సినిమాలు లేక, ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. చాలా కాలంగా సినీ పెద్దలు ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూ ఉండగా.. ఏపీ ప్రభుత్వం తాజాగా వాటిపై స్పందించింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ లు 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు చెల్లించాల్సిన విద్యుత్‌ స్థిర చార్జీలను పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలల కాలానికి, అంటే 2020 […]

సినిమా హాళ్లకు రాయితీలు.. సీఎం జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు..
X

కరోనా వల్ల సినిమాలు లేక, ఆదాయం కోల్పోయి ఇబ్బంది పడుతున్న థియేటర్ల యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. చాలా కాలంగా సినీ పెద్దలు ఈ విషయంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నపాలు చేస్తూ ఉండగా.. ఏపీ ప్రభుత్వం తాజాగా వాటిపై స్పందించింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ లు 2020 ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు చెల్లించాల్సిన విద్యుత్‌ స్థిర చార్జీలను పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలల కాలానికి, అంటే 2020 జులై నుంచి డిసెంబర్‌ వరకు విద్యుత్‌ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణాలపై 50 శాతం వడ్డీ రాయితీ కూడా ఇచ్చింది. వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత నుంచి వర్తిస్తుందని పేర్కొంది. విద్యుత్ చార్జీల విషయంలో మల్టీప్లెక్స్ లకు వెసులుబాటు ఇచ్చినా.. వడ్డీ రాయితీ విషయంలో మాత్రం వాటిని పక్కనపెట్టారు. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధి కలిగేలా ఈ రాయితీలిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

సినిమా హాళ్లకు విద్యుత్ చార్జీల మినహాయింపు, వడ్డీరాయితీని ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న సినీ రంగాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని ప్రశంసించారు. జగన్‌ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

First Published:  6 April 2021 8:24 PM GMT
Next Story