Telugu Global
NEWS

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..

ఏపీలో ఈనెల 8న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం.. బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆదివారం తీర్పు రిజర్వు చేసింది. కాసేపటి క్రితం ఎన్నికలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు […]

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్..
X

ఏపీలో ఈనెల 8న జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం.. బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆదివారం తీర్పు రిజర్వు చేసింది. కాసేపటి క్రితం ఎన్నికలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

నాలుగు వారాల నిబంధన..
ఎన్నికల విషయంలో పోలింగ్ కి నాలుగు వారాల ముందుగా ఎన్నికల కోడ్ అమలులోకి రావాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈనెల 1న ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని అదేరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. 8వతేదీ ఎన్నికలు, 10వతేదీ కౌంటింగ్ జరుగుతుందని ప్రకటించారు. అంటే కేవలం వారం రోజుల గ్యాప్ తో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందనమాట. సుప్రీం ఆదేశాల మేరకు నాలుగు వారాల ముందుగా కోడ్ అమలులోకి వచ్చి, ఆ తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పరిషత్ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడి ఏడాది దాటిపోయింది. ఈ కారణంగా నాలుగు వారాల నిబంధనను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకున్నట్టు లేదు. అయితే హైకోర్టు మాత్రం, సుప్రీం తీర్పుని ఉటంకిస్తూ.. నాలుగు వారాల నిబంధన ప్రకారం ఎన్నికలు జరగడానికి వీలు లేదంటూ, పరిషత్ ఎన్నికల ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

కొత్త నోటిఫికేషన్ ఇస్తారా..?
పాత నోటిఫికేషన్ రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేది ప్రతిపక్షాల వాదన. బీజేపీ, జనసేన, టీడీపీ కూడా ఇదే విషయంపై హైకోర్టుని ఆశ్రయించాయి. ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశాయి. తాజా ఉత్తర్వుల్లో కొత్త నోటిఫికేషన్ విషయంపై హైకోర్టు స్పందించలేదు. దీనిపై ఈనెల 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు జారీ చేసింది.

First Published:  6 April 2021 5:58 AM GMT
Next Story