Telugu Global
Cinema & Entertainment

గల్లీ రౌడీ ఫస్ట్ లుక్ రిలీజ్

సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా గల్లీ రౌడీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. కేవలం సందీప్ కిషన్ లుక్ మాత్రమే కాకుండా.. సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులందరితో మరో పోస్టర్ కూడా వదిలారు. ఈ సినిమాకు ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సమస్యల వల్ల ఆ టైటిల్ ను తప్పించారు. దాని స్థానంలో గల్లీ రౌడీ పేరును […]

గల్లీ రౌడీ ఫస్ట్ లుక్ రిలీజ్
X

సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా గల్లీ రౌడీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. కేవలం సందీప్ కిషన్ లుక్ మాత్రమే కాకుండా.. సినిమాలో నటిస్తున్న కీలక నటీనటులందరితో మరో పోస్టర్ కూడా వదిలారు.

ఈ సినిమాకు ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని సమస్యల వల్ల ఆ టైటిల్ ను తప్పించారు. దాని స్థానంలో గల్లీ రౌడీ పేరును ఫిక్స్ చేసి ఈరోజు ఫస్ట్ లుక్ వదిలారు. డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, డైరెక్టర్‌ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా బ్యానర్లపై కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయో.. కామెడీ కూడా అదే రేంజ్ లో ఉంటుందంటున్నారు మేకర్స్

First Published:  4 April 2021 7:04 AM GMT
Next Story