Telugu Global
MOVIE REVIEWS

సుల్తాన్ మూవీ రివ్యూ

నటీనటులు: కార్తీ, ర‌ష్మిక, యోగిబాబు, నెపోలియ‌న్‌ తదితరులు ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్‌ నిర్మాత‌లు: య‌స్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్ర‌భు బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌ సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌ మ్యూజిక్‌: వివేక్ మెర్విన్‌ రేటింగ్: 2.25/5 కొత్త కథలు దొరకవు. ఉన్న కథల్నే కొత్తగా చెప్పాలి. ట్రీట్ మెంట్ కొత్తగా ఉండాలి. అప్పుడే సినిమా నిలబడుతుంది. సుల్తాన్ మూవీ డైరక్టర్ కూడా ఇదే పని చేశాడు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు తనదైన ట్రీట్ […]

సుల్తాన్ మూవీ రివ్యూ
X

నటీనటులు: కార్తీ, ర‌ష్మిక, యోగిబాబు, నెపోలియ‌న్‌ తదితరులు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: బ‌క్కియ‌రాజ్ క‌ణ్ణ‌న్‌
నిర్మాత‌లు: య‌స్‌.ఆర్‌. ప్ర‌కాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్ర‌భు
బ్యాన‌ర్‌: డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌
మ్యూజిక్‌: వివేక్ మెర్విన్‌
రేటింగ్: 2.25/5

కొత్త కథలు దొరకవు. ఉన్న కథల్నే కొత్తగా చెప్పాలి. ట్రీట్ మెంట్ కొత్తగా ఉండాలి. అప్పుడే సినిమా
నిలబడుతుంది. సుల్తాన్ మూవీ డైరక్టర్ కూడా ఇదే పని చేశాడు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు
తనదైన ట్రీట్ మెంట్ జోడించాడు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో పొందలేకపోయాడు.

ఊరిలో ఒక సమస్య ఉంటుంది. అదే ఊరిలో హీరోయిన్ ఉంటుంది. ఊరికి పట్టిన సమస్యను హీరో
పరిష్కరిస్తాడు. హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటే ఇంతకంటే రొటీన్ స్టోరీ ఇంకోటి
ఉండదు. కానీ దీనికి వందమంది రౌడీలు అనే యాంగిల్ జోడించాడు దర్శకుడు. అదే సుల్తాన్ కు
కొత్తదనం తీసుకొచ్చింది. అయితే కొత్త ఎలిమెంట్ అయితే యాడ్ చేశాడు కానీ, ఆ ఎలిమెంట్ చుట్టూ కొత్త
సీన్లు రాసుకోలేకపోయాడు దర్శకుడు కణ్నన్.

కథ విషయానికొస్తే.. సేతుపతి (నెపోలియన్) వైజాగ్ లో పెద్ద రౌడీ. అతడి వద్ద ప్రాణాలిచ్చే వంద మంది
రౌడీలుంటారు. సేతుపతికి ఒకే ఒక్క కొడుకు సుల్తాన్ (కార్తి.) చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన సుల్తాన్ ను ఈ
వంద మంది రౌడీలు ప్రేమగా పెంచుతారు. అనుకోకుండా అమరావతి దగ్గర్లోని వెలగపూడి గ్రామానికి
వెళ్తాడు సుల్తాన్. అక్కడే రుక్మిణి (రష్మిక)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆ గ్రామానికి ఓ సమస్య
ఉంటుంది. ఆ సమస్యను తీరుస్తానని సుల్తాన్ తండ్రి గతంలోనే మాటిచ్చి ఉంటాడు. తండ్రి మాట
నెరవేర్చేందుకు సుల్తాన్, గ్రామంలోనే ఉండిపోతాడు. ఈ క్రమంలో తను అన్నలుగా భావించే వంద మంది
రౌడీలకు, సుల్తాన్ కు మధ్య అభిప్రాయబేధాలొస్తాయి. అసలు రౌడీలకు, సుల్తాన్ కు మధ్య గ్యాప్
ఎందుకొస్తుంది.. ఇంతకీ ఊరికి వచ్చిన సమస్యేంటి అనేది ఈ సుల్తాన్ కథ.

ఎప్పట్లానే కార్తి తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. యాక్షన్ తో పాటు అన్ని రకాల భావోద్వేగాల్ని
పండించాడు. కాకపోతే అతడు తన ఫిజిక్ పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పొట్ట ముందుకొచ్చి కాస్త
లావుగా కనిపించాడు. హీరోయిన్ గా రష్మికకు ఈసారి అరకొర మార్కులే పడతాయి. పల్లెటూరి అమ్మాయిగా
ఆమెకు యాక్ట్ చేయడానికి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు దర్శకుడు. చాలాచోట్ల రష్మిక కనిపిస్తుంది కానీ ఆమె
ప్రభావం మాత్రం స్క్రీన్ పై కనిపించదు. ఉందంటే ఉందంతే.

టెక్నికల్ గా సినిమాలో మెచ్చుకోవద్ద విషయం ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ. సూర్యన్
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అటు డ్రీమ్ వారియర్స్ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ రెండు ఎలిమెంట్స్ తప్పితే, టెక్నికల్ గా చెప్పుకోవడానికి సినిమాలో ఏం లేదు. పాటలైతే అస్సలు వినసొంపుగా లేవు.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు రొటీన్ కథలకు కొత్త ట్రీట్ మెంట్ ఇస్తూ చాలామంది దర్శకులు హిట్స్ కొడుతున్నారు. సుల్తాన్ దర్శకుడు కూడా అదే ప్రయత్నం చేశాడు. కాకపోతే తన టాలెంట్ ను కేవలం కొన్ని సీన్లకు మాత్రమే పరిమితం చేశాడు. దీనికితోడు యాక్షన్ మూవీలో మెలోడ్రామా పెట్టి అక్కడక్కడ విసిగించాడు. పైగా సినిమా నిడివి రెండున్నర గంటలు. ఇలాంటి కథలకు అంత రన్ టైమ్ అక్కర్లేదు.

ఓవరాల్ గా కార్తి ఈసారి తెలుగులో తను అనుకున్న విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 3 యాక్షన్ సీన్లు, కార్తి పెర్ఫార్మెన్స్ కోసం సుల్తాన్ సినిమాను ఓసారి చూడొచ్చు.

First Published:  2 April 2021 7:19 AM GMT
Next Story