Telugu Global
NEWS

భారత రైల్వే జీవితకాలం లేటేనా..?

తొలి దశలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ, రైల్వే సర్వీసులు రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అన్ లాక్ ప్రక్రియ మొదలై, తిరిగి జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నా కూడా రైళ్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. తీరా ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దశలో.. రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1నుంచి స్పెషల్ ట్రైన్స్ ని పట్టాలెక్కించింది. అన్ లాక్ తర్వాత తిరిగి లాక్ డౌన్ […]

భారత రైల్వే జీవితకాలం లేటేనా..?
X

తొలి దశలో కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ, రైల్వే సర్వీసులు రద్దు చేస్తూ గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అన్ లాక్ ప్రక్రియ మొదలై, తిరిగి జనజీవనం సాధారణ స్థితికి చేరుకున్నా కూడా రైళ్లు పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాలేదు. తీరా ఇప్పుడు సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దశలో.. రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1నుంచి స్పెషల్ ట్రైన్స్ ని పట్టాలెక్కించింది. అన్ లాక్ తర్వాత తిరిగి లాక్ డౌన్ స్టేజ్ కి పరిణామాలన్నీ చకచకా జరుగుతుంటే.. రైల్వే శాఖ మాత్రం ఇంకా అన్ లాక్ దగ్గరే ఆగిపోవడం.. తీరిగ్గా ఇప్పుడు కొత్త రైళ్లంటూ హడావిడి చేయడం విశేషం.

డైలీ ఎక్స్‌ ప్రెస్ లు, వీక్లీ ఎక్స్ ప్రెస్ లు కూడా ఏప్రిల్ 1నుంచి పట్టాలెక్కాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విశాఖ, విజయవాడ, గుంటూరు జిల్లాల వాసుల కోసం పల్నాడు ఎక్స్‌ ప్రెస్, డెల్టా ఎక్స్‌ప్రెస్, సింహాద్రి ఎక్స్‌ ప్రెస్ ఏప్రిల్ 1నుంచి పరుగులు తీస్తున్నాయి. పల్నాడు ఎక్స్ ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 5.45గంటలకు గుంటూరునుంచి బయలుదేరి పిడుగురాళ్ల, సికింద్రాబాద్ మీదుగా మధ్యాహ్నం 12.05కి వికారాబాద్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.40కి వికారాబాద్ లో బయలుదేరి సికింద్రాబాద్ మీదుగా రాత్రి 9గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ రైలు సర్వీసుని బాగా ఆలస్యంగా ప్రారంభించింది దక్షిణమధ్య రైల్వే. గుంటూరు విశాఖపట్నం ఎక్స్ ప్రెస్, కాచిగూడ – రేపల్లె డెల్టా ప్యాసింజర్ కూడా పట్టాలెక్కుతున్నాయి.

మరీ ఇంత లేటా..?
సెకండ్ వేవ్ పేరుతో మరోసారి లాక్ డౌన్ అమలులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో.. ఇంకా అన్ లాక్ వద్దే ఆగిపోయిన రైల్వే శాఖ, ఇప్పుడు కొత్తగా ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్ రైళ్లను నడుపుతామంటూ ప్రకటనలిస్తోంది. కేసులు భారీగా పెరిగితే.. కొత్తగా పట్టాలెక్కిన రైళ్లు ఎక్కువరోజులు తిరిగే అవకాశమే లేదంటున్నారు నిపుణులు. ప్రజా రవాణాపై ఆంక్షలు పెడితే కచ్చితంగా రైళ్లను కూడా ఆపేస్తారని, ఇంత హడావిడిగా రైల్వే శాఖ కొత్త రైళ్లను ప్రవేశ పెట్టి ఉపయోగం లేదని చెబుతున్నారు.

First Published:  1 April 2021 9:29 PM GMT
Next Story