Telugu Global
Cinema & Entertainment

రజనీకాంత్​కు దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు..! ఎన్నికల జిమ్మిక్కా..!

ప్రముఖ నటుడు, సూపర్​స్టార్​ రజనీకాంత్​కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుదక్కింది. రజనీకాంత్​కు ఈ అవార్డు దక్కడం పట్ల ఫ్యాన్స్​, తమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజనీకి అవార్డు దక్కడం పట్ల అప్పుడే విమర్శలు కూడా ఊపందుకున్నాయి. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది. కేంద్రం రజనీకి అవార్డు ఇచ్చింది కాబట్టి ఆయన ఫ్యాన్స్​ అంతా బీజేపీకి దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఓట్లు […]

రజనీకాంత్​కు దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డు..! ఎన్నికల జిమ్మిక్కా..!
X

ప్రముఖ నటుడు, సూపర్​స్టార్​ రజనీకాంత్​కు ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుదక్కింది. రజనీకాంత్​కు ఈ అవార్డు దక్కడం పట్ల ఫ్యాన్స్​, తమిళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే రజనీకి అవార్డు దక్కడం పట్ల అప్పుడే విమర్శలు కూడా ఊపందుకున్నాయి. త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్నాయి కాబట్టే.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్న వాదన కూడా తెరమీదకు వచ్చింది.

కేంద్రం రజనీకి అవార్డు ఇచ్చింది కాబట్టి ఆయన ఫ్యాన్స్​ అంతా బీజేపీకి దాని మిత్రపక్షమైన అన్నాడీఎంకే ఓట్లు వేస్తారని బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకున్నారట. తమిళ ప్రజలకు సెంటిమెంట్​ ఎక్కువ కాబట్టి.. ఒకవేళ బీజేపీ మీద ఏదైనా కోపం ఉన్నా ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోతుందని బీజేపీ ఎత్తు వేసిందని సమాచారం.

భారతీయ నటుల్లో గొప్పనటుడైన సూపర్​ స్టార్​ రజనీకాంత్​కు అవార్డు ఇవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జవదేకర్​ పేర్కొన్నారు. ఆయనలో ఒక్క నటుడు మాత్రమే కాక.. నిర్మాతగా, స్క్రీన్​ రైటర్​గా ఆయన సత్తా చాటారని పేర్కొన్నారు.

ధన్యవాదాలు చెప్పిన మోదీ..!
రజనీకాంత్​కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన ఎన్నో విభిన్నమైన, వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారని పేర్కొన్నారు. రజనీ సేవలు మరువలేనివని కొనియాడారు. రజనీకాంత్​ ఒక్క తమిళనాడు మాత్రమే కాక .. దేశం మొత్తం గర్వించదగ్గ నటుడు అంటూ కొనియాడారు.

గతంలోనూ ఎన్నో అవార్డులు..!
బస్​కండెక్టర్​గా జీవితాన్ని ప్రారంభించిన రజనీకాంత్​ సూపర్​స్టార్​గా ఎదిగారు. ఒక్క తమిళనాడులో కాక.. దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. తన కెరీర్​లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో, వైవిధ్యమైన చిత్రాల్లో ఆయన నటించారు. ముఖ్యంగా రజనీ స్టయిల్​, డైలాగ్​ డెలివరీ, వాకింగ్​ స్టయిల్​, డ్యాన్స్​ అన్ని భిన్నంగానే ఉంటాయి. అందుకే ఆయనకు తమిళనాడులో అంత క్రేజ్​ ఉంది.

ఎన్నో అవార్డులు..
రజనీకి గతంలో పద్మవిభూషణ్​ సహా ఎన్నో అవార్డులు వచ్చాయి. గతంలో శివాజీ గణేషన్‌(తమిళం), రాజ్‌కుమార్‌(కన్నడ), బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి (తెలుగు), ఎల్వీ ప్రసాద్‌ (తెలుగు), నాగిరెడ్డి (తెలుగు), అక్కినేని నాగేశ్వరరావు (తెలుగు), గోపాలకృష్ణన్‌ (మలయాళం), రామానాయుడు(తెలుగు), బాలచందర్‌ (తెలుగు, తమిళం), కె విశ్వనాథ్‌(తెలుగు) ఈ అవార్డులు అందుకున్నారు.

రాజకీయం కోసమేనా?
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రజనీకి అవార్డు వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఫ్యాన్స్​ ఖుషీ అవుతుండగా.. ప్రత్యర్థులు, కొందరు విమర్శకులు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దాదా సాహెబ్​ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్​ అర్హుడే కానీ.. ఈ ఎన్నికల టైంలో అవార్డు ప్రకటించడం అనుమానాలకు తావిస్తున్నదని కొందరు విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా దక్షిణాదికి చెందిన రజనీకి అవార్డు దక్కడం గర్వించదగ్గ విషయం.

First Published:  1 April 2021 2:16 AM GMT
Next Story