Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ రికార్డుల వేట

పవన్ ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఉన్నారో వకీల్ సాబ్ ట్రయిలర్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తే అర్థమౌతుంది. ఈ సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది వకీల్ సాబ్ ట్రయిలర్. యూట్యూబ్ లో రిలీజైన 7 నిమిషాలకే వకీల్ సాబ్ ట్రయిలర్ కు లక్ష లైకులొచ్చాయి. ఇక 20 నిమిషాల్లో ఆ కౌంట్ 2 లక్షలకు చేరిపోయింది. చూస్తుండగానే 40 నిమిషాల్లో 3 లక్షల లైకులొచ్చాయి. ఇలా గంటగంటకు […]

వకీల్ సాబ్ రికార్డుల వేట
X

పవన్ ఫ్యాన్స్ ఎంత ఆకలితో ఉన్నారో వకీల్ సాబ్ ట్రయిలర్ సృష్టిస్తున్న రికార్డులు చూస్తే అర్థమౌతుంది.
ఈ సినిమా ట్రయిలర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది.
ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తోంది వకీల్ సాబ్ ట్రయిలర్.

యూట్యూబ్ లో రిలీజైన 7 నిమిషాలకే వకీల్ సాబ్ ట్రయిలర్ కు లక్ష లైకులొచ్చాయి. ఇక 20 నిమిషాల్లో ఆ
కౌంట్ 2 లక్షలకు చేరిపోయింది. చూస్తుండగానే 40 నిమిషాల్లో 3 లక్షల లైకులొచ్చాయి. ఇలా గంటగంటకు
కౌంట్ పెంచుకంటూ ప్రస్తుతం 9 లక్షల లైకులకు దగ్గరగా ఉంది ఈ ట్రయిలర్. అటు వ్యూస్ పరంగా 15
మిలియన్ వ్యూస్ ను ఎప్పుడో దాటేసింది.

ఏప్రిల్ 9న థియేటర్లలోకి రాబోతోంది వకీల్ సాబ్ సినిమా. సినిమాను ఇప్పటికే భారీ రేట్లకు అమ్మారు. బ్రేక్
ఈవెన్ అయి బయ్యర్లకు లాభాలు రావాలంటే.. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వాలి. ఒక్క ఏపీలోనే ఈ
సినిమాను 42 కోట్ల రూపాయల రేషియోలో అమ్మారు.

First Published:  30 March 2021 3:34 AM GMT
Next Story