Telugu Global
National

తమిళనాడు.. గౌతమి వర్సెస్ కమల్​

కమల్ హాసన్​.. గౌతమి వీళ్లిద్దరిదీ హిట్​ పెయిర్​. చాలా సినిమాల్లో కలిసి నటించారు. కొంత కాలం సహజీవనం కూడా చేశారు. అయితే వివిధ కారణాల వల్ల వీళ్లు విడిపోయారు. ఇదిలా ఉంటే త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్​ కూడా పోటీచేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందే ఆయన మక్కల్​ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. అప్పట్లో ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సారి […]

తమిళనాడు.. గౌతమి వర్సెస్ కమల్​
X

కమల్ హాసన్​.. గౌతమి వీళ్లిద్దరిదీ హిట్​ పెయిర్​. చాలా సినిమాల్లో కలిసి నటించారు. కొంత కాలం సహజీవనం కూడా చేశారు. అయితే వివిధ కారణాల వల్ల వీళ్లు విడిపోయారు. ఇదిలా ఉంటే త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కమల్ హాసన్​ కూడా పోటీచేస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు ముందే ఆయన మక్కల్​ నీది మయ్యం అనే పార్టీని స్థాపించారు. అప్పట్లో ఈ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం కమల్ కాస్త సీరియస్​గానే రాజకీయాల్లోకి దిగారు.

ఇదిలా ఉంటే కమల్​ హాసన్​పై ఆయన మాజీ ప్రేయసి గౌతమి హాట్​ కామెంట్లు చేశారు. కమల్​ తీరుపై ఓ రేంజ్​లో విరుచుకుపడ్డారు. కమల్​ రాజకీయాల్లో మార్కెటింగ్​ స్కిల్స్​ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. తమిళ ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. కమల్​ హాసన్​ సత్తా ఏమిటో మే 2 న తేలిపోతుందన్నారు. కాగా, కమల్​ హాసన్​ పై గౌతమి కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

మరోవైపు ఈ సారి ఎన్నికల బరిలో చాలా మంది సినీనటులు బరిలో ఉన్నారు. ఓ వైపు రాధిక, శరత్​కుమార్​ దంపతులు సైతం కమల్​ పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీలో ఉన్నారు. అయితే గౌతమి వ్యాఖ్యలపై కమల్​ హాసన్​ ఇంకా స్పందించలేదు. ఆయన నేరుగా గౌతమికి కౌంటర్​ ఇస్తారా? లేక తన పార్టీ వాళ్లచేత కౌంటర్​ ఇప్పిస్తారా? అన్నది వేచిచూడాలి.

కమల్​ హాసన్​ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు. తనదైన స్టైల్‌​లో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మిగతా పార్టీల్లాగా ఉచిత హామీలు ఇవ్వకుండా.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని.. ఉద్యోగ కల్పన చేస్తానని హామీ ఇస్తున్నారు.

First Published:  30 March 2021 6:55 AM GMT
Next Story