Telugu Global
Cinema & Entertainment

అలా శ్రీకారం "చుట్టేశారు"

చిరంజీవి ప్రమోషన్ కలిసిరాలేదు.. కేటీఆర్ మాటలు కూడా పనిచేయలేదు. ఇలా భారీ ప్రమోషన్ చేసినప్పటికీ శ్రీకారం కోలుకోలేదు. తాజాగా ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసింది. శర్వానంద్ కెరీర్ లో వరుసగా మరో అట్టర్ ఫ్లాప్ వచ్చి చేరింది. కొంతకాలంగా ఫ్లాపులు చూస్తున్నాడు శర్వా. చేసేవన్నీ ప్రామిసింగ్ సబ్జెక్టులే. కానీ థియేటర్లలోకి వచ్చేసరికి ఫలితాలు తారుమారైపోతున్నాయి. ఉదాహరణకు జాను సినిమానే తీసుకుంటే, సూపర్ హిట్ సినిమాకు రీమేక్ ఇది. సమంత లాంటి హీరోయిన్, దిల్ రాజు లాంటి […]

అలా శ్రీకారం చుట్టేశారు
X

చిరంజీవి ప్రమోషన్ కలిసిరాలేదు.. కేటీఆర్ మాటలు కూడా పనిచేయలేదు. ఇలా భారీ ప్రమోషన్ చేసినప్పటికీ శ్రీకారం కోలుకోలేదు. తాజాగా ఈ సినిమా ఫైనల్ రన్ ముగిసింది. శర్వానంద్ కెరీర్ లో వరుసగా మరో అట్టర్ ఫ్లాప్ వచ్చి చేరింది.

కొంతకాలంగా ఫ్లాపులు చూస్తున్నాడు శర్వా. చేసేవన్నీ ప్రామిసింగ్ సబ్జెక్టులే. కానీ థియేటర్లలోకి వచ్చేసరికి ఫలితాలు తారుమారైపోతున్నాయి. ఉదాహరణకు జాను సినిమానే తీసుకుంటే, సూపర్ హిట్ సినిమాకు రీమేక్ ఇది. సమంత లాంటి హీరోయిన్, దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఉన్నారు. కానీ రిజల్ట్ చూస్తే ఫెయిల్.

జాను కంటే ముందొచ్చిన రణరంగం, పడిపడి లేచే మనసు సినిమాలదీ ఇదే పరిస్థితి. రణరంగం సినిమాకు కాజల్ లాంటి హీరోయిన్ దొరికింది. భారీ బ్యానర్ ఉంది. ట్రయిలర్ అదిరిపోయింది. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్. అటు ‘పడిపడి లేచే మనసు’ సినిమా మరో రొమాంటిక్ క్లాసిక్ అయిపోతుందన్నట్టు ప్రచారం జరిగింది. కానీ సాయిపల్లవి మేజిక్ కూడా కలిసిరాలేదు. కట్ చేస్తే డిజాస్టర్.

ఇక శ్రీకారం విషయానికొస్తే.. ఇది కూడా శర్వా ఫ్లాపుల జాబితాలోకే చేరింది. ఓ మోస్తరు అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆడలేదు. రెవెన్యూ పరంగా చూసుకుంటే.. 16 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా 9.6 కోట్ల రూపాయల వసూళ్ల వద్దే ఆగిపోయింది.

శర్వానంద్ సక్సెస్ ట్రాక్ కు ఈ సినిమా శ్రీకారం చుట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో మహాసముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తున్నాడు. ఆశలన్నీ ఈ సినిమాలపైనే.

First Published:  29 March 2021 2:31 AM GMT
Next Story