Telugu Global
Cinema & Entertainment

అన్న సినిమా తమ్ముడి చేతికి..!

ఇలా వచ్చాడో లేదా అలా అన్న సినిమాను ఎగరేసుకుపోయాడు తమ్ముడు వైష్ణవ్ తేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా గిరీశయ్య దర్శకత్వంలో సాయితేజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు చేతులు మారింది. నిర్మాత, దర్శకుడు సేమ్. హీరో మాత్రం మారిపోయాడు. సాయితేజ్ స్థానంలో వైష్ణవ్ తేజ్ వచ్చి చేరాడు. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై సాయితేజ్ చేయాల్సిన సినిమా కూడా వైష్ణవ్ […]

అన్న సినిమా తమ్ముడి చేతికి..!
X

ఇలా వచ్చాడో లేదా అలా అన్న సినిమాను ఎగరేసుకుపోయాడు తమ్ముడు వైష్ణవ్ తేజ్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా గిరీశయ్య దర్శకత్వంలో సాయితేజ్ చేయాల్సిన సినిమా ఇప్పుడు చేతులు మారింది. నిర్మాత, దర్శకుడు సేమ్. హీరో మాత్రం మారిపోయాడు. సాయితేజ్ స్థానంలో వైష్ణవ్ తేజ్ వచ్చి చేరాడు.

ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో వైష్ణవ్ తేజ్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై సాయితేజ్ చేయాల్సిన సినిమా కూడా వైష్ణవ్ తేజ్ చెంతకు చేరింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ను బయటపెట్టబోతున్నారు.

నిజానికి ఇది సాయితేజ్ చేజారిన ప్రాజెక్టు కాదు. తనకుతానుగా సాయితేజ్ వదులుకున్న సినిమా. వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సాయితేజ్, లెక్క ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ తర్వాత అదే బ్యానర్ పై గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమా చేయాలి. కానీ ఆ సబ్జెక్ట్ తనకంటే తమ్ముడికి బాగుంటుందని భావించి, తనే రిఫర్ చేశాడు.

First Published:  28 March 2021 3:10 AM GMT
Next Story