Telugu Global
NEWS

సీఎం జగన్ పై ట్వీట్లు.. రత్నప్రభకు ఇక్కట్లు..

కర్నాటక మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీలో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఆమెకు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా గౌరవం ఉంది. వైఎస్ఆర్ జయంతి, వర్థం సందర్భంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నివాళులర్పిస్తుంటారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో వైద్యశాఖ పనితీరుని కూడా ఆమె ఓ సందర్భంలో మెచ్చుకున్నారు. […]

సీఎం జగన్ పై ట్వీట్లు.. రత్నప్రభకు ఇక్కట్లు..
X

కర్నాటక మాజీ చీఫ్ సెక్రటరీ, ప్రస్తుత తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏపీలో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఆమెకు వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నా, ఆయన కుటుంబం అన్నా గౌరవం ఉంది. వైఎస్ఆర్ జయంతి, వర్థం సందర్భంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నివాళులర్పిస్తుంటారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో వైద్యశాఖ పనితీరుని కూడా ఆమె ఓ సందర్భంలో మెచ్చుకున్నారు. కోవిడ్ టైమ్ లో ఏపీ ఆరోగ్య శాఖ స్పందన బాగుందని ట్వీట్ వేసి అభినందించారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆమె వైసీపీ అభ్యర్థిపై పోటీకి దిగి, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో ఆమె వేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. జగన్ పాలన మెచ్చుకున్న రత్నప్రభ, ఇప్పుడు బీజేపీ కోసం అబద్ధాలు చెప్పాల్సి వస్తోందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ కారణం వల్లే ఆమెకు జనసేన మద్దతివ్వడంలేదని, పవన్ కల్యాణ్ ప్రచారానికి రావడంలేదని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చారు రత్నప్రభ.

సోమవారం నెల్లూరులో నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు రత్నప్రభ. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీకి జనసేనకు మధ్య విభేదాలు లేవని, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంకోసం పవన్ కల్యాణ్ వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని వివరించారు. తన అభ్యర్థిత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ 200శాతం సంతృప్తిగా ఉన్నారని, తప్పకుండా ప్రచారానికి వస్తానంటూ తనకు హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు రత్నప్రభ. సీఎం జగన్ మంచి పనిచేస్తే ప్రశంసించానని, అంత మాత్రాన ఆయనకు తాను మద్దతిచ్చినట్టు కాదని వివరణ ఇచ్చుకున్నారు. డబ్బుకు ఓటు వేయాలో, నీతి, నిజాయితీకి ఓటు వేయాలో ప్రజలే తేల్చు కోవాలని సూచించారు. మొత్తమ్మీద గతంలో జగన్ సర్కారు పనితీరుపై పాజిటివ్ ట్వీట్ వేసి, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.

First Published:  28 March 2021 6:29 AM GMT
Next Story