Telugu Global
NEWS

తెలంగాణ సర్కారుకి ప్రైవేటు సెగ..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలను పూర్తిగా మూసేసింది కేసీఆర్ సర్కారు. అదే సమయంలో సినిమా థియేటర్లు తెరిచే ఉన్నాయి, బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు కూడా యథావిధిగానే రన్ అవుతున్నాయి. పైపెచ్చు లాక్ డౌన్ విధించేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు కేసీఆర్. సరిగ్గా ఇక్కడే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు కోపమొచ్చింది. లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ఫీజులు లేక, అద్దెలు కట్టుకోలేక […]

తెలంగాణ సర్కారుకి ప్రైవేటు సెగ..
X

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలను పూర్తిగా మూసేసింది కేసీఆర్ సర్కారు. అదే సమయంలో సినిమా థియేటర్లు తెరిచే ఉన్నాయి, బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు కూడా యథావిధిగానే రన్ అవుతున్నాయి. పైపెచ్చు లాక్ డౌన్ విధించేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టారు కేసీఆర్. సరిగ్గా ఇక్కడే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలకు కోపమొచ్చింది. లాక్ డౌన్ టైమ్ లో కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, ఫీజులు లేక, అద్దెలు కట్టుకోలేక బాగా ఇబ్బంది పడ్డాయి. ఉపాధ్యాయులు కూడా పనిలేక, జీతాలు లేక అవస్థలు పడ్డారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కూడా కేవలం స్కూల్స్ పైనే పడే సరికి వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దెబ్బ మీద దెబ్బ ప్రతిసారీ మాపైనే ఎందుకు పడుతోందంటూ రోడ్డెక్కారు తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు.

బార్ల లైసెన్స్ లు ఇప్పించండి..
కరోనా సాకు చెప్పి స్కూల్స్ మూసేశారు సరే, మరి థియేటర్లు, బార్లు, రెస్టారెంట్ల వల్ల కరోనా అంటుకోదా, వాటికెలా పర్మిషన్ ఇచ్చారని లాజిక్ తీస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ నిర్వాహకులు. తమకో న్యాయం, వారికో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. కనీసం తమకు బార్ల లైసెన్సులయినా ఇప్పించాలని, స్కూల్స్ మూసేసుకుని ఆ పని అయినా చేసుకుని బతుకుతామని నిష్టూరమాడుతున్నారు.

తెలంగాణ స్కూల్స్, హాస్టల్స్ లో కరోనా కేసులు పెరగడంతో ముందు జాగ్రత్తగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలను మూసివేసింది ప్రభుత్వం. ఈ ఏడాది పరీక్షలు లేనట్టేని తేల్చేసింది. పదో తరగతి పరీక్షల విషయంలో కూడా తదుపరి ఆదేశాలిస్తామని చెప్పింది. ఇటు తెలంగాణ కంటే కేసులు తక్కువగా ఉన్న ఏపీలో మాత్రం స్కూల్స్ తెరిచే ఉన్నాయి. కరోనా కేసులు వచ్చిన స్కూల్స్ మినహా మిగతా అన్నిటినీ తెరిచే ఉంచుతామని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఒంటిపూట బడులతోపాటు నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వంతో పోలిక పెట్టి మరీ తెలంగాణ సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయామని, మరోసారి స్కూల్స్ మూసివేసి ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తమని వాడుకుని ఇప్పుడు రోడ్డునపడేశారని అంటున్నాయి.

First Published:  28 March 2021 7:47 AM GMT
Next Story