Telugu Global
MOVIE REVIEWS

తెల్లవారితే గురువారం రివ్యూ

నటీనటులు: శ్రీసింహ, చిత్రా శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, వైవా హర్ష, శరణ్య ప్రదీప్ తదితరులు కెమెరా: సురేష్ ఎడిటింగ్: సత్య గిదుటూరి సంగీతం: కాలభైరవ నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనెర్జీ ముప్పనేని దర్శకత్వం: మణికాంత్ గెల్లి విడుదల తేదీ: 27 మార్చ్ 2021 రేటింగ్: 1.5 శ్రీ సింహా.. మంచి ప్లానింగ్ తో వచ్చిన కుర్రాడు. కాన్సెప్ట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. ఇకపై ఇతడ్నుంచి వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ. […]

తెల్లవారితే గురువారం రివ్యూ
X

నటీనటులు: శ్రీసింహ, చిత్రా శుక్ల, మిష నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, వైవా హర్ష, శరణ్య ప్రదీప్
తదితరులు
కెమెరా: సురేష్
ఎడిటింగ్: సత్య గిదుటూరి
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు: రజని కొర్రపాటి, రవీంద్ర బెనెర్జీ ముప్పనేని
దర్శకత్వం: మణికాంత్ గెల్లి
విడుదల తేదీ: 27 మార్చ్ 2021
రేటింగ్: 1.5

శ్రీ సింహా.. మంచి ప్లానింగ్ తో వచ్చిన కుర్రాడు. కాన్సెప్ట్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. ఇకపై ఇతడ్నుంచి
వచ్చే సినిమాలకు మినిమం గ్యారెంటీ. ఇతడికి ఆ బుర్ర ఉంది. నటుల్లో తనకంటూ ఓ సెపరేట్ జానర్,
ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. మత్తు వదలరా సినిమా రిలీజైన తర్వాత జనాలు అనుకున్న
మాటలివి. ఈ మంచి అభిప్రాయాలన్నింటినీ ఒకే ఒక్క సినిమాతో తప్పని తనకుతానుగా
నిరూపించుకున్నాడు శ్రీసింహా. అతడు నటించిన “తెల్లవారితే గురువారం” సినిమా ప్రేక్షకులతో నరకం
స్పెల్లింగ్ రాయించింది.

శ్రీసింహా సినిమాలు బాగాలేకపోయినా కనీసం విసిగించవు అనే అభిప్రాయం జనాల్లో ఉంది. దీనికితోడు
ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్, రాజమౌళి లాంటి ప్రముఖులు ఈ సినిమాను ఆకాశానికెత్తిన తీరు చూస్తే, ఏదో
విషయం ఉందని భావించారంతా. అయితే ఈరోజు రిలీజైన ఈ సినిమా మొదటి ఆటకే టపా కట్టేసే రేంజ్
లో ఉంది.

జస్ట్ 2 గంటల 6 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా దాదాపు 4-5 గంటల పాటు థియేటర్లలో సీట్లకు
కట్టేసిన ఫీలింగ్ తెచ్చిపెడుతుంది. ఆట మొదలైన 5 నిమిషాలకే సినిమా పస ఏంటో తెలియజెప్పేలా
సీన్లు రావడం, ఆ తర్వాత వాటికి రెట్టించిన నరకాన్ని చూపిస్తూ సన్నివేశాలు పడ్డంతో.. ప్రతి 10
నిమిషాలకు టైమ్ చూసుకోవడం, వాట్సాప్ మెసేజీలు చెక్ చేసుకోవడం ప్రేక్షకుల వంతయింది.

సినిమా చూస్తున్నంతసేపు దాని గురించి కాకుండా.. శ్రీసింహా జడ్జిమెంట్ గురించి మైండ్ ఆలోచిస్తుంది.
మత్తు వదలరా లాంటి సినిమా చేసిన ఆ నటుడేనా, ఈ నాసిరకం సినిమాను ఒప్పుకున్నది అనే సందేహం
మెదడును తొలిచేస్తుంది. అంతలా డిసప్పాయింట్ చేశాడు ఈ హీరో.

ఇంతోటి దానికి ఇక్కడ కథ చెప్పుకోవడం కూడా వేస్ట్. కాకపోతే రివ్యూ రాస్తున్నాం కాబట్టి.. 3 ముక్కల్లో కథ
చెప్పుకుందాం. హీరోకు హీరోయిన్ తో పెళ్లి కుదురుతుంది. కానీ హీరోకు ఇష్టం ఉండదు. సేమ్ టైమ్
హీరోయిన్ కు కూడా ఇష్టం ఉండదు. ఇద్దరూ పారిపోయే పనిలో ఉంటారు. ఇంతకీ ఇద్దరూ ఎందుకు పెళ్లి
వద్దనుకున్నారు. హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది కథ.

శ్రీసింహాలో మంచి స్టఫ్ ఉంది. అతడి యాక్టింగ్ లో ఈజ్ ఉంది. ఇప్పుడున్న నటుల్లో కొంతమంది స్టార్స్ కూడా సరిగ్గా పలికించలేని కొన్ని ఎక్స్ ప్రెషన్స్ ను (సందర్భానుసారం) శ్రీసింహా అద్భుతంగా చూపించాడు. కానీ ఇలాంటి నస పెట్టే కథల్ని, సాగతీసే కథనాల్ని అతడు ఎంచుకోకుండా ఉండాలి. లేదంటే భవిష్యత్తులో శ్రీసింహా ‘నంది’ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా చూడ్డానికి థియేటర్లలో ప్రేక్షకులు ఉండరు. ఇతడ్ని మినహాయిస్తే, మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడం వేస్ట్.

టెక్నికల్ గా కూడా సినిమా ఏమంత సౌండ్ అనిపించుకోదు. కాలభైరవ ఈసారి నిరుత్సాహపరిచగా.. కెమెరా వర్క్ అంతంతమాత్రంగా ఉంది. ఎడిటింగ్ లో మరో అర్థగంట సినిమా లేపేయొచ్చు. రన్ టైమ్ తగ్గిపోతుందని అలా వదిలేసినట్టున్నారు. వారాహి బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా తెల్లవారితే గురువారం సినిమా సహనానికి పరీక్ష పెడుతుంది. తలనొప్పి తెచ్చిపెడుతుంది.

First Published:  27 March 2021 6:41 AM GMT
Next Story