Telugu Global
Health & Life Style

బరువు తగ్గాలా? ఈ మిస్టేక్స్ చేయొద్దు!

బరువు తగ్గడం కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో మిస్టేక్‌ జరుగుతుంది. ముఖ్యంగా డైట్, వ్యాయామాల్లో సరైనవి ఎంచుకోకపోవడం కూడా ఒక రీజన్. బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం వ్యాయామాల నుంచి లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వరకూ చాలా విషయాలు చెక్ చేసుకోవాలి. బరువు తగ్గడం కోసం కేవలం వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. దానికి సెల్ఫ్ కంట్రోల్‌తో పాటు, డిసిప్లైన్ కూడా ఉండాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు […]

బరువు తగ్గాలా? ఈ మిస్టేక్స్ చేయొద్దు!
X

బరువు తగ్గడం కోసం చాలామంది చాలారకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో మిస్టేక్‌ జరుగుతుంది. ముఖ్యంగా డైట్, వ్యాయామాల్లో సరైనవి ఎంచుకోకపోవడం కూడా ఒక రీజన్. బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం వ్యాయామాల నుంచి లైఫ్‌స్టైల్ హ్యాబిట్స్ వరకూ చాలా విషయాలు చెక్ చేసుకోవాలి.

బరువు తగ్గడం కోసం కేవలం వ్యాయామాలు చేయడం మాత్రమే కాదు. దానికి సెల్ఫ్ కంట్రోల్‌తో పాటు, డిసిప్లైన్ కూడా ఉండాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతుంటే కొన్ని విషయాలను చెక్ చేసుకోవాలి. అవేంటంటే..

ఇవి ముఖ్యం
బరువు తగ్గడం కోసం ఫాలో అయ్యే డైట్ సరిగ్గా పనిచేయాలంటే.. డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వడంతో పాటు, తీసుకునే ఫుడ్ క్వాలిటీగా మెరుగ్గా ఉండాలి. లేకపోతే రిజల్ట్ కనిపించదు. అందుకే వంటలో వాడే నూనెల నుంచి పప్పులు, దినుసుల వరకూ అన్ని మంచి క్వాలిటీ ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు డైట్‌లో స్వీట్స్, పంచదార ను తీసుకోవడం, సరైన మొతాదులో నీళ్లు తాగకపోవడం, హెల్దీఫ్యాట్స్ తీసుకోకపోవడం, స్మోకింగ్ లాంటి కారణాలు కూడా బరువు తగ్గకుండా అడ్డుపడతాయి.

మిక్స్‌డ్ వ్యాయామాలు
బరువు తగ్గకపోవడంలో మరో రీజన్ వ్యాయామాల్లో వెయిట్ ట్రైనింగ్‌ను నిర్లక్ష్యం చేయడం. బరువు తగ్గడం కోసం చాలామంది కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తారు. కానీ రన్నింగ్, జాగింగ్, ట్రెడ్‌మిల్‌తో పాటు వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు కూడా చేస్తేనే.. శరీరానికి రెసిస్టెన్స్ పెరిగి, జీవక్రియలు సరిగ్గా పని చేస్తాయి. అప్పుడు బరువు తగ్గడం సులభమవుతుంది.

బరువు తగ్గాలంటే అన్నిరకాల వ్యాయామాలు కలిపి చేయాలి. అప్పుడే మెటబాలిజం కంట్రోల్‌లో ఉంటుంది. ప్రతిరోజూ వ్యాయామం చేయలేని వాళ్లు కుదిరినప్పుడల్లా చేస్తూ.. వారానికి మూడు నుంచి ఐదు గంటల వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాయామంలో యోగా, వెయిట్‌ ట్రైనింగ్‌, కార్డియో కలిసి ఉండాలి. ముఖ్యంగా మహిళలకు వెయిట్ ట్రైనింగ్ వ్యాయామాలు ఎంతో అవసరం.

First Published:  27 March 2021 3:40 AM GMT
Next Story