Telugu Global
Cinema & Entertainment

గల్లీ రౌడీగా మారిన హీరో

కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూతనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న యువ హీరో సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ముందుగా ‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కొన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా ఈ సినిమా టైటిల్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు మార్చారు. ఇప్పుడీ చిత్రానికి ‘గ‌ల్లీరౌడీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. […]

గల్లీ రౌడీగా మారిన హీరో
X

కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూతనకంటూ ఓ ప్రత్యేకమైన
ఇమేజ్‌ను దక్కించుకున్న యువ హీరో సందీప్‌ కిషన్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రానికి ముందుగా
‘రౌడీ బేబీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కొన్ని సాంకేతిక కార‌ణాల కార‌ణంగా ఈ సినిమా టైటిల్‌ను
ద‌ర్శ‌క నిర్మాత‌లు మార్చారు. ఇప్పుడీ చిత్రానికి ‘గ‌ల్లీరౌడీ’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తున్న‌ట్లు యూనిట్
అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఈ సినిమాకు ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమాను లాంచ్ చేసిన రోజే టైటిల్ ఫస్ట్
లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ టైటిల్ ను ఇదివరకే మరో ప్రొడక్షన్ కంపెనీ రిజిస్టర్ చేయించింది.
దీంతో ఆ టైటిల్ స్థానంలో గల్లీ రౌడీ పేరును రిజిస్టర్ చేయించారు.

రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరిస్తున్నారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌,
ఎంవీవీ సినిమా పతాకాలపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది.

నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహ కీలక పాత్రలో
నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌న్ రైడ‌ర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు
సంబంధించిన వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలిపారు.

First Published:  25 March 2021 10:03 AM GMT
Next Story