Telugu Global
NEWS

‘పనబాక’ నామినేషన్​.. అచ్చెన్న సెటైర్లు..!

తిరుపతి ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్​ దాఖలు చేశారు. ముందుగా ఆమె నెల్లూరులోని వీఆర్​సీ సెంటర్​ లో అంబేద్కర్​ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్​ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు జగన్​ పిలుపుతో 22 మంది గొర్రెలను గెలిపించారని వ్యాఖ్యానించారు. వారంతా ఎక్కడున్నారో […]

‘పనబాక’ నామినేషన్​.. అచ్చెన్న సెటైర్లు..!
X

తిరుపతి ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్​ దాఖలు చేశారు. ముందుగా ఆమె నెల్లూరులోని వీఆర్​సీ సెంటర్​ లో అంబేద్కర్​ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి వెళ్లి నామినేషన్​ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు జగన్​ పిలుపుతో 22 మంది గొర్రెలను గెలిపించారని వ్యాఖ్యానించారు. వారంతా ఎక్కడున్నారో తెలియదని.. పార్లమెంట్​లో రాష్ట్ర సమస్యలపై ఒక్కసారి కూడా స్పందించడం లేదని.. ప్రత్యేక హోదా ఊసు ఎత్తడం లేదని విమర్శించారు.

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపిస్తే ఆమె పార్లమెంట్​లో రాష్ట్రసమస్యలపై గళం విప్పుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు పనిలో పనిగా వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ సానుభూతి పరులను వైసీసీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. పోలీసుల సాయంతో దౌర్జన్యాలకు దిగుతోందని మండిపడ్డారు. టీడీపీ సానుభూతి పరులు వ్యాపారాలు చేసుకుంటున్నా.. వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్​ చేశారు. జగన్​ ఒక్కఛాన్స్​ అంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో వైసీసీని ఓడగొట్టి.. ఆ పార్టీకి బుద్ధి చెప్పాలంటూ అచ్చెన్న పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు రెఫరెండం కాదంటూ వ్యాఖ్యానించారు.

దీంతో ఒక్కసారిగా వైసీసీ శ్రేణులు మండిపడ్డాయి. అచ్చెన్నాయుడికి సీన్​ అర్థమైందని ముందే ఓటమిని అంగీకరించారని వైసీసీ ఎంపీ విజయ్​సాయిరెడ్డి ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

First Published:  24 March 2021 7:33 PM GMT
Next Story