Telugu Global
International

సూయజ్‌లో చిక్కుకున్న ఓడ.. ప్రపంచ వ్యాపారానికి అడ్డంకులు

ప్రపంచ సముద్ర వ్యాపారానికి జీవనాడి వంటి సూయజ్ కాలువలో ఒక భారీ ఓడ చిక్కుకొని పోయింది. మధ్యధార సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపే సూయజ్ కాలువ ఈజిప్టులో ఉన్నది. మంగళవారం ఈ కాలువ గుండా ఒక భారీ నౌక వెళ్తూ ఒడ్డును ఢీకొని కాలువలో అడ్డంగా కూరుకొని పోయింది. తూర్పు, పశ్చిమ దేశాలకు స‌రుకు రవాణా చేసే నౌకలు ఎక్కువగా ఈ కాలువ గుండా వెళ్తుంటాయి. కాలువలో నౌక చిక్కుకొని పోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ […]

సూయజ్‌లో చిక్కుకున్న ఓడ.. ప్రపంచ వ్యాపారానికి అడ్డంకులు
X

ప్రపంచ సముద్ర వ్యాపారానికి జీవనాడి వంటి సూయజ్ కాలువలో ఒక భారీ ఓడ చిక్కుకొని పోయింది. మధ్యధార సముద్రం, ఎర్ర సముద్రాన్ని కలిపే సూయజ్ కాలువ ఈజిప్టులో ఉన్నది. మంగళవారం ఈ కాలువ గుండా ఒక భారీ నౌక వెళ్తూ ఒడ్డును ఢీకొని కాలువలో అడ్డంగా కూరుకొని పోయింది. తూర్పు, పశ్చిమ దేశాలకు స‌రుకు రవాణా చేసే నౌకలు ఎక్కువగా ఈ కాలువ గుండా వెళ్తుంటాయి. కాలువలో నౌక చిక్కుకొని పోవడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే నౌకాయాన కాలువల్లో సూయజ్ అగ్రస్థానంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే నౌక రవాణాలో 12 శాతం సూయజ్ ద్వారానే జరుగుతుంది. యూరోప్, ఆసియా దేశాల మధ్య దూరాన్ని తగ్గించడంలో సూయజ్‌దే కీలకపాత్ర. దీంతో ఈ కాలువ నిత్యం రద్దీగా ఉంటుంది. మానవ నిర్మీత కాలువల్లో ఇదే అతి పెద్దది.

కాగా, పనామాలో రిజిస్టర్ అయిన ఎంవీ ఎవర్ గ్రీన్ అనే భారీ కంటైనర్ నౌక చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్తున్నది. 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక 2018లో నిర్మించారు. కాగా, చైనా నుంచి నెదర్లాండ్‌లోని రోట్టెర్‌డామ్‌కు వెళ్తున్న క్రమంలో సూయజ్‌లోకి ప్రవేశించింది. అప్పుడు బలమైన గాలుల కారణంగా నౌక దిశ మారి కాలువ ఒడ్డుకు ఢీకొని మట్టిలో కూరుకొని పోయింది. దాదాపు 2 లక్షల టన్నుల బరువున్న ఈ నౌక చిక్కుకొని పోవడంతో ఇరువైపుల నుంచి నౌకలు తిరగడానికి వీల్లేకుండా పోయింది.

తైవాన్‌కు చెందిన ఎవరగ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ నౌకను నిర్వహిస్తున్నది. బలమైన గాలుల కారణంగానే నౌకకు ప్రమాదం సంభవించినట్లు సదరు సంస్థ తెలిపింది. నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా, సూయజ్ కెనాల్ అథారిటీ ప్రస్తుతం ఈ నౌకను బయటకు తీసుకొని రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే డిగ్గర్లు కాలువ ఒడ్డు నుంచి నౌక పరిస్థితిని గమనించారు. నౌకను బయటకు తీయడానికి రెండు వారాల సమయమైనా పడుతుందని చెబుతున్నారు. మరోవైపు దీని వల్ల నౌకాయానానికి తీవ్రమైన ఆటంకం కలుగుతున్నది.

సూయజ్‌లోని ట్రాఫిక్ కారణంగా ఈజిప్టు అధికారులు పాత కాలువ గుండా తాత్కాలికంగా నౌకలను పంపుతున్నారు. కానీ ఈ కాలువ గుండా వెళ్లడం అంత సులభమైనది కాదు. దీని వల్ల ప్రపంచ వాణిజ్యానికి ఆటంకం కలుగుతున్నదని.. నిత్యావసరాలు, క్రూడాయిల్ ధరలు పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 30 శాతం కంటైనర్ ఓడలు ఈ కాలువ గుండా ప్రయాణిస్తాయి. 2020 డేటా ప్రకారం 19 వేల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయి. అంటే రోజుకు సగటున 51.5 నౌకలు సూయజ్ గుండా ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కాలువకు ఇరువైపులా ఆగిపోయాయి.

150 ఏళ్ల క్రితం బ్రిటిష్, ఫ్రెంచ్ ప్రభుత్వాలు ఈ కాలువను నిర్మించాయి. అయితే 1956 నుంచి ఈజిప్టు ఆధీనంలోకి ఈ కాలువ వెళ్లింది. 2015లో ఈ కాలువ సామర్థ్యాన్ని పెంచడానికి నిర్మాణాలు ప్రారంభించారు.

First Published:  24 March 2021 11:09 PM GMT
Next Story