Telugu Global
Cinema & Entertainment

స్టాండప్ కమెడియన్ గా మారిన హీరో

రాజ్ తరుణ్ మరో సినిమా రెడీ చేస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం ఇది. దీనికి `స్టాండ‌ప్ రాహుల్‌` అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ లో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ‌ డెస్క్ మీద కూర్చున్న రాజ్‌త‌రుణ్ లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. […]

స్టాండప్ కమెడియన్ గా మారిన హీరో
X

రాజ్ తరుణ్ మరో సినిమా రెడీ చేస్తున్నాడు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై
మోహన్ వీరంకిని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం ఇది.
దీనికి 'స్టాండ‌ప్ రాహుల్‌' అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ లో ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ‌ డెస్క్ మీద కూర్చున్న రాజ్‌త‌రుణ్ లుక్
అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది. స్టైలిష్ మేకోవ‌ర్‌, స్టైలిష్ హెయిర్‌డోతో క్లీన్ షేవ్‌ లుక్‌లో ఫ‌స్ట్‌లుక్‌లో
యూబ‌ర్‌-కూల్‌గా కనిపిస్తున్నాడు రాజ్ త‌రుణ్‌. టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డంతో పాటు ఈ ఫస్ట్ లుక్
పోస్టర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

జీవితంలో దేన్నీ పెద్దగా పట్టించుకోని, ధైర్యంగా నిలబడని ఒక వ్య‌క్తి … నిజమైన ప్రేమను కనుగొని, తన
తల్లిదండ్రుల కోసం, అతని ప్రేమ కోసం స్టాండప్ కామెడీ పట్ల ఉన్న త‌న‌ అభిరుచిని చాటుకునే
స్టాండ్-అప్ కామిక్ కథ ఇది. సినిమాలో రాజ్ తరుణ్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  24 March 2021 7:56 AM GMT
Next Story