Telugu Global
Cinema & Entertainment

తలైవి ట్రైలర్ రివ్యూ

దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ […]

తలైవి ట్రైలర్ రివ్యూ
X

దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న
చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు
అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల
చేయనున్నారు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ
మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విశాల్ విఠల్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
తలైవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి పాల్గొన్నారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. జయలలిత జీవితంలోని కీలక మలుపులు, ఘట్టాలన్నీ ట్రయిలర్ లో
కనిపించాయి. మరీ ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా జయలలిత చీర పట్టుకొని లాగిన ఘటన కూడా ట్రయిలర్
లో ఉంది.

నిన్ను గెలవాలని అనుకోవడానికి నువ్ అంత పెద్ద మనిషివేం కాదు.. నిన్న కురిసిన వానకు.. ఇవాళ
మొలిచిన గడ్డిమొక్కవి నువ్.. మర్రిచెట్టును ఢీ కొట్టాలని చూడకు’.. ‘ఎవరు మొక్కో ఎవరు చెట్టో కాలమే
సమాధానం చెబుతుంది..’, ‘మహాభారతంలో ద్రౌపదికి ఇదే జరిగింది.. తన చీరను లాగి అవమాన పరిచిన
కౌరవుల కథ ముగించి జడ ముడిచి శపదాన్ని నెరవేర్చుకుంది.. ఆ మహా భారతానికి ఇంకో పేరు ఉంది
అదే జయ..’ లాంటి డైలాగ్స్ టీజర్‌లో అదిరిపోయాయి.

కంగనా, అరవింద్ స్వామి మేకర్స్, సెట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఏప్రిల్ లో
థియేటర్లలో రాబోతోంది తలైవి.

First Published:  23 March 2021 9:18 AM GMT
Next Story