Telugu Global
Health & Life Style

హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేయాలంటే..

హార్మోన్స్ మన శరీరాన్ని మెదడుతో లింక్ చేసే కెమికల్స్ లాంటివి. అవి సరైన మోతాదులో ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి శ్వాస ఎంత అవసరమో హార్మోనులు కూడా అంతే ముఖ్యం. శరీరంలో హార్మోనులు ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి. అవసరానికి మించి ఎక్కువ విడుదలైనా, తక్కువ విడుదలైనా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ప్రస్తుతం వస్తున్న ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం. చాలా […]

హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేయాలంటే..
X

హార్మోన్స్ మన శరీరాన్ని మెదడుతో లింక్ చేసే కెమికల్స్ లాంటివి. అవి సరైన మోతాదులో ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం. ఒక్కమాటలో చెప్పాలంటే.. మనిషి ఆరోగ్యంగా జీవించడానికి శ్వాస ఎంత అవసరమో హార్మోనులు కూడా అంతే ముఖ్యం.

శరీరంలో హార్మోనులు ఎంత మోతాదులో ఉండాలో అంతే ఉండాలి. అవసరానికి మించి ఎక్కువ విడుదలైనా, తక్కువ విడుదలైనా ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. ప్రస్తుతం వస్తున్న ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఒక కారణం.

చాలా సమస్యలకు..
డయాబెటిస్, ఇన్‌ఫెర్టిలిటీ లాంటి సమస్యలకు ముఖ్యంగా హార్మోన్సే కారణం. మనశరీరంలో సుమారు రెండొందలకు పైగా హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్, కార్డిసాల్, ఇన్సులిన్, లెప్టిన్, థైరాయిడ్ ఇలా.. రకరకాల పనితీరులకు సంబంధించి రకరకాల హార్మోన్లు ఉంటాయి. ఉదాహరణకు థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలో మెటబాలిజంను కంట్రోల్ చేస్తాయి. ఒకవేళ ఈ హార్మోన్స్ ఎక్కువగా లేదా తక్కువగా రిలీజ్ అయినప్పుడు శరీరం బ్యాలెన్స్ తప్పుతుంది. బరువు పెరగడం, అలసటగా ఫీలవ్వడం లాంటి సమస్యలొస్తాయి. అయితే హార్మోన్స్ తయారీలో మనం తీసుకునే ఆహారమే కీ రోల్ పోషిస్తుంది. అందుకే సరైన ఆహారంతో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను తగ్గించొచ్చు.

కూరగాయలు
హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే ఫుడ్స్‌లో వెజిటేబుల్స్ కూడా బెస్ట్ ఆప్షన్. ఆకుకూరలు, క్యాబేజీ, బ్రొకొల్లీ లాంటి గ్రీన్ వెజిటబుల్స్‌లో న్యూట్రీయెంట్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హార్మోనులను బ్యాలెన్స్ చేసి మెటబాలిజంను పెంచుతాయి.

ఆర్గానిక్ ఫుడ్స్
ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఎలాంటి కెమికల్స్ లేని ఫుడ్స్. టాక్సిన్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ లాంటివి లేకుండా నేచురల్‌గా పండించిన ఆర్గానిక్ ఫుడ్స్ లో నేచురల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. హార్మోన్స్‌ను బ్యాలెన్స్డ్‌గా ఉంచడానికి ఈ ఫుడ్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి.

ఫైబర్
హార్మోనులను సమతుల్యంగా ఉంచడంలో ఫైబర్ కంటెంట్ బాగా పనికొస్తుంది. గోధుమలు, బ్రెడ్, బ్రౌన్ రైస్ లాంటి రిచ్ ఫైబర్ ఫుడ్స్‌తో హార్మోన్స్‌ను బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవచ్చు.

హెల్దీ ఫ్యాట్స్
చేపలు, ఆలివ్ ఆయిల్, నట్స్, హోల్ గ్రెయిన్స్ లాంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందుకే అలాంటి హెల్దీ ఫ్యాట్స్ ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ను తగ్గించుకోవచ్చు.

క్యారెట్స్.. బీన్స్..
క్యారెట్‌లో ఉండే ఫైబర్ కంటెంట్, ఈస్ట్రోజెన్.. శరీరంలోని హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేసి, వాటి లెవల్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. వీటితో పాటు క్యారెట్స్, బెర్రీస్ , బఠానీలు, సోయా బీన్స్ సిట్రస్ ఫ్రూట్స్, గ్రేప్స్, రెడ్ బెర్రీస్ కూడా మంచి హార్మోన్ బ్యాలెన్సింగ్ ఫుడ్స్ గా పనిచేస్తాయి.

ఫ్లాక్ సీడ్స్
ఫ్లాక్ సీడ్స్‌లో లిగనెన్స్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. దాంతో పాటు బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్‌‌ను తగ్గించడంలో, ఫ్యాట్‌ను బర్న్ చేయడంలో కుడా సాయపడతాయి.

ఇవి కూడా..
– హార్మోన్స్ బ్యాలెన్స్డ్‌గా ఉండాలంటే.. కాఫీ తాగడాన్ని తగ్గించాలి. కెఫిన్ కొన్ని హార్మోన్స్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.
– రోజుకు సరిపడా నిద్రపోవడం వల్ల హార్మోన్స్‌ను బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవచ్చు. మంచి నిద్ర.. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్‌ను, మూడ్ స్వింగ్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
– హార్మోన్స్ బ్యాలెన్సింగ్ కోసం రెగ్యులర్ వ్యాయామం కూడా ఎంతో అవసరం. వ్యాయామంతో హార్మోనుల పని తీరు మెరుగుపడుతుంది.

First Published:  23 March 2021 3:22 AM GMT
Next Story