Telugu Global
National

గోవా రోడ్లపై పరుగులు తీయబోతున్న ఒలెక్ట్రా..

ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో ఇకపై శబ్దంలేని, కాలుష్య రహిత ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయబోతున్నాయి. గోవా రాష్ట్రానికి మొత్తం 50 బస్సులను సరఫరా చేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ. మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్, అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సుల్ని తయారు చేస్తోంది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశగా.. కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఫేమ్ – 2 పథకంలో భాగంగా ఈ […]

గోవా రోడ్లపై పరుగులు తీయబోతున్న ఒలెక్ట్రా..
X

ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాలో ఇకపై శబ్దంలేని, కాలుష్య రహిత ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయబోతున్నాయి. గోవా రాష్ట్రానికి మొత్తం 50 బస్సులను సరఫరా చేసింది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ. మేఘా అనుబంధ సంస్థ అయిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్, అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ బస్సుల్ని తయారు చేస్తోంది. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే దిశగా.. కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టిన ఫేమ్ – 2 పథకంలో భాగంగా ఈ బస్సులను గోవా రాష్ట్రానికి సరఫరా చేస్తున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వీటిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇప్పటికే పుణె, మంబై, నాగ్ పూర్, హైదరాబాద్, డెహ్రాడూన్, సిల్వస్సా.. సహా కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. త్వరలో మరో 1225 బస్సులను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది.

దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో తయారైన ఎలక్ట్రిక్ బస్సులను గోవా రాష్ట్రంలో నడపడం చాలా గర్వంగా ఉందని అన్నారు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ప్రతినిధులు. గోవా పర్యావరణాన్ని పరిరక్షించడంలో ఒలెక్ట్రా బస్సులు తమ వంతు పాత్ర పోషిస్తాయని చెప్పారు.

ఒలెక్ట్రా బస్సు ప్రత్యేకతలివీ..
12 మీటర్ల పొడవు ఉన్న ఈ ఏసీ బస్సులో డ్రైవర్ సహా 48 మంది ప్రయాణికులకు సీటింగ్ ఉంటుంది. వికలాంగులు, వృద్ధుల కోసం హైడ్రాలిక్ వీల్ చెయిర్ ర్యాంపు సదుపాయం కూడా ఉంది. ఎలక్ట్రిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్ సదుపాయంతోపాటు, సీసీ టీవీల పర్యవేక్షణ, ఎమర్జెన్సీ బటన్, యూఎస్ బీ తో కూడిన సాకెట్ అందుబాటులో ఉంటాయి. బస్సులోని లిథియమ్-అయాన్ బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ద్వారా బ్రేక్ వేసిన ప్రతిసారీ బ్యాటరీ చార్జ్ అవుతుంది.

భారత రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఒక భాగం..
భారత పౌర రవాణా వ్యవస్థలో ఒలెక్ట్రా ఒక భాగంగా మారిపోయింది. ఇప్పటికే దేశంలో 4 కోట్ల కిలోమీటర్లకు పైగా ఈ బస్సులు ప్రయాణం చేశాయి. వీటి వల్ల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల ఉత్పత్తి 13000 టన్నుల మేరకు తగ్గింది. ఇది లక్ష చెట్లు నాటడంతో సమానం. మనాలి నుండి రోహ్ తంగ్ పాస్ వరకు ఎత్తయిన కొండల్లో కూడా ఒలెక్ట్రా బస్సులు ప్రయాణం సాగిస్తున్నాయి. ఒలెక్ట్రా కంపెనీ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించింది.

మెయిల్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్..
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థగా 2000 సంవత్సరంలో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ స్థాపించారు. ఇది ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. 2015 లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థగా ఒలెక్ట్రా రికార్డు సృష్టించింది. బస్సుల తయారీలోనే కాదు, విద్యుత్ సరఫరా, పంపిణీ నెట్ వర్క్ ల కోసం.. సిలికాన్ రబ్బరు, కాంపోజిట్ ఇన్సులేటర్ల తయారీలో దేశంలోనే ఇదే అతిపెద్ద సంస్థ.

First Published:  23 March 2021 6:06 AM GMT
Next Story